మహేష్ బాబు - రాజమౌళి సినిమాలో విలన్ గా బాలీవుడ్ హీరో.. నిజమైతే అరాచకమే..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో మాస్ కమర్షియల్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ స్టేజ్ లో ఉంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీకి గుంటూరు కారం అనే పేరు ఖరారు చేశారు. టైటిల్ బట్టి ఈ మూవీ అవుట్ అండ్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండబోతోందని అర్ధమవుతోంది.

ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ పాన్ వరల్డ్ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. కంప్లీట్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత ఈ ఏడాది ఆఖరు మూవీని ప్రారంభించే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. అలాగే వచ్చే ఏడాది వేసవి లోపు సెట్స్ పైకి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 SSMB 29

ఇక ఈ మూవీ కోసం హాలీవుడ్ క్యాస్టింగ్ ఏజెన్సీతో రాజమౌళి ఒప్పందం చేసుకున్నారు. అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో వరల్డ్ అడ్వంచర్ ట్రావెలర్ గా ఈ చిత్రంలో మహేష్ బాబు కనిపించనున్నాడు. స్టొరీకి తగ్గట్లుగానే క్యాస్టింగ్ ని ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక న్యూస్ తెరపైకి వచ్చింది.

బాలీవుడ్, టాలీవుడ్ కలయికలో రాబోతోన్న అతి పెద్ద వెంచర్ SSMB 29 మూవీ అవ్వబోతోందంట. ఈ మూవీ కోసం బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ని విలన్ గా తీసుకుంటున్నారని బాలీవుడ్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారాలు స్టార్ట్ చేశారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునేని ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసారంట. ఈ ప్రచారం ఇప్పుడు బిటౌన్ లో జోరుగా సాగుతోంది. దీంతో సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా సర్క్యులేట్ అవుతోంది.

ఈ ప్రచారం ఎస్ఎస్ఎంబి 29 సినిమాకి అమీర్ ఖాన్ ని విలన్ గా ఎంపిక చేసారనే విషయంలో ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక ఇది ఎంతవరకీ నిజమో అనేది పక్కన పెడితే ఒక వేళ ఇది నిజమైతే మాత్రం బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వడం పక్కా అనే టాక్ వస్తోంది.

ఇక ప్రస్తుతం ఈ చిత్రం ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉంది. బౌండెడ్ స్క్రిప్ట్ కంప్లీట్ కావడానికి కనీసం లేదా నెలలు సమయం పడుతుందని ఫిల్మ్ నగర్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. ఇక స్క్రిప్ట్ కూడా కంప్లీట్ కాకుండానే అప్పుడే బాలీవుడ్ లో ఈ సినిమాపై ఈ తరహాలో ప్రచారం చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక త్రివిక్రమ్ సినిమాను మహేష్ ఈ ఏడాది అక్టోబర్ ల్9 ఫినిష్ చేసి నవంబర్ లో రాజమౌళి ప్రాజెక్ట్ లో మరోసారి చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X