twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రకాష్ రాజ్ కి ఝలక్ ఇచ్చిన నిర్మాత...!?

    By Sindhu
    |

    నిర్మాతలని ఏడిపించడంలో, వాళ్ల డబ్బులు నాశనం చేయించడంలో ప్రకాష్ రాజ్ తర్వాతే ఎవరైనా అనేది జగమెరిగిన సత్యం. షూటింగ్ కి అంతా రెడీ చేసుకుంటే సెట్ కి మరీ ఆలస్యంగా రావడమో లేదా అసలు రాకపోవడమో చేసి నిర్మాతలకి లక్షల్లో నష్టం తెచ్చే ప్రకాష్ రాజ్ మీద ఎట్టకేలకు ఒక నిర్మాత పగ తీర్చుకున్నాడు. తమిళంలో సూర్యతో 'సింగం" చిత్రాన్ని నిర్మించిన జ్ఝానవేల్ రాజాని కూడా అందర్నీ ఏడిపించినట్టుగానే ప్రకాష్ రాజ్ అష్టకష్టాలు పెట్టాడు. అయినా కానీ అతను పెట్టిన టార్చర్ అంతా రాజా మైనంగా భరించాడు. సమయం చూసుకుని ప్రకాష్ రాజ్ కి సరయిన ఝలక్ ఇచ్చాడు.

    అసలు విషయం ఏంటంటే 'సింగం" తెలుగులోకి అనువదించినప్పుడు తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకుంటానని, దానికి ఎక్స్ ట్రా పేమెంట్ ఇవ్వాలని ప్రకాష్ రాజ్ డిమాండ్ చేశాడట. సరేనని చెప్పిన నిర్మాత 'సింగం"ని తెలుగులోకి 'యముడు" పేరుతో అనువదించి జూలై 2న విడుదల కూడా చేసేస్తున్నాడు కానీ ప్రకాష్ రాజ్ కి మాట మాత్రం కూడ చెప్పలేదట. తన పాత్రకి ఎవరో మిమిక్రీ ఆర్టిస్టుతో డబ్బింగ్ చెప్పించేశారని తెలుసుకున్న ప్రకాష్ రాజ్ ఇప్పుడు అన్యాయం జరిగిపోయిందని మొత్తుకుంటున్నాడు.

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సదరు నిర్మాత మీద ఫిర్యాదు కూడా చేశాడు. అయితే డబ్బింగ్ చెప్పించడమనేది పూర్తిగా నిర్మాత ఇష్టం కనుక 'మా" కూడా చేతులెత్తేసిందట. నిజానికి ఒక పాపులర్ ఆర్టిస్ట్ కి వేరే వారితో డబ్బింగ్ చెప్పిస్తే సినిమాకే నష్టం జరుగుతుంది. అది తెలిసినా కూడా ప్రకాష్ రాజ్ తో డబ్బింగ్ చెప్పించుకుని, అతడిని ఇంకో రెండ్రోజులు భరించే ఓపిక లేక ఆ నష్టాన్ని కూడా భరించడానికే 'యముడు" నిర్మాత సిద్దపడ్డాడు. ఎప్పుడూ ప్రకాష్ రాజ్ మీద నిర్మాతలు కంప్లయింట్ చేయడమే చూసిన సినీ వర్గాలు ఇప్పుడు సీన్ రివర్స్ అవడంతో లోలోపలే నవ్వుకుంటున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X