నాని 'జెర్సీ' సంచలనాలు.. 50 కోట్లు దాటేసిన ప్రీరిలీజ్ బిజినెస్!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం జెర్సీ. మళ్ళిరావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాని ఈ చిత్రంలో క్రికెటర్ పాత్రలో నటిస్తుండడం ఆసక్తి రేపుతోంది. ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. డబుల్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న నానికి గత ఏడాది కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ చిత్రాలు బ్రేక్ వేసాయి. వరుసగా ప్రేమ కథలు, ఎంటర్ టైనింగ్ చిత్రాలు చేస్తూ వచ్చిన నాని జెర్సీ చిత్రంతో రూటు మార్చాడు. తాజాగా ఈ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ గురించి వస్తున్న వార్తలు ట్రేడ్ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి.

 దుమ్మురేపిన శాటిలైట్ రైట్స్

దుమ్మురేపిన శాటిలైట్ రైట్స్

జెర్సీ చిత్ర డిజిటల్, శాటిలైట్స్ రైట్స్ కలిపి 12 కోట్ల ధర పలికినట్లు తెలుస్తోంది. యువతలో, ఫ్యామిలీ ఆడియన్స్ లో నానికి మంచి క్రేజ్ ఉంది. దీనితో నాని చిత్రాల శాటిలైట్ రైట్స్ కోసం ఎప్పుడూ మంచి డిమాండ్ నెలకొని ఉంటుంది. విడుదలకు ముందే హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా అమ్ముడైనట్లు తెలుస్తోంది. హిందీ డబ్బింగ్ హక్కులకు 6కోట్ల ధర పలికినట్లు తెలుస్తోంది.

 తెలుగు రాష్ట్రాల్లో

తెలుగు రాష్ట్రాల్లో

థియేట్రికల్ బిజినెస్ కూడా కళ్ళు చెదిరే రేంజ్ లో జరిగినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలలో జెర్సీ చిత్రానికి 30 కోట్లవరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ లో 4 కోట్లకు జెర్సీ డిస్ట్రిబ్యూషన్ హక్కులు అమ్ముడైనట్లు తెలుస్తోంది. నాని కెరీర్ లోనే ఇది హైయెస్ట్ ప్రీరిలీజ్ బిజినెస్ అని అంటున్నారు. మొత్తంగా జెర్సీ చిత్రానికి విడుదలకు ముందే 50 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. చిత్రం ఆకట్టుకునే విధంగా ఉంటె లాభాల పంట పండించడం పెద్ద కష్టం కాదు. గతంలో యావరేజ్ గా అనిపించిన నాని చిత్రాలు కూడా కమర్షియల్ గా మంచి విజయాన్ని దక్కించుకున్నాయి.

శ్రద్దా శ్రీనాథ్

శ్రద్దా శ్రీనాథ్

ఈ చిత్రంలో నానికి జోడిగా శ్రద్దా శ్రీనాథ్ నటిస్తోంది. క్రికెటర్ గా నాని శిక్షణ తీసుకుని మరీ ఈ చిత్రంలో నటిస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని ఎమోషనల్ గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ అంటే ఇష్టపడే యువకుడు తన కలని ఎలా సాకారం చేసుకున్నాడు అనే తరహాలో ఈ చిత్రం ఉండబోతోంది.

సమ్మర్‌లో విడుదల

సమ్మర్‌లో విడుదల

జెర్సీ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్ 19న విడుదల చేయనున్నారు. యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ జెర్సీ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం తర్వాత నాని విక్రమ్ కుమార్ దర్శత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X