రాంచరణ్, ఎన్టీఆర్ 200 రోజుల పాటు.. ఇద్దరికీ కళ్ళు చెదిరే పారితోషికం!

Recommended Video

High Remuneration For NTR And Ram Charan For RRR Movie

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దర్శకధీరుడు రాజమౌళి రూపొందించబోతున్న భారీ మల్టీస్టారర్ చిత్రానికి రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యాయి. తాజగా రాజమౌళి రాంచరణ్, ఎన్టీఆర్ లుక్ పై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవలే రాజమౌళి ఎన్టీఆర్ ఫిజికల్ ట్రైనర్ ని కలసిన సంగతి తెలిసిందే. నవంబర్ నుంచి ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాలు ఉన్నట్లు తెలుస్తోంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని 300 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మించబోతున్న సంగతి తెలిసిందే.

రాంచరణ్, ఎన్టీఆర్ 200 రోజుల పాటు

రాంచరణ్, ఎన్టీఆర్ 200 రోజుల పాటు

ఈ చిత్రం కోసం రాంచరణ్, ఎన్టీఆర్ 200 రోజుల కాల్ షీట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన 2020 వరకు ఎన్టీఆర్, రాంచరణ్ ఆర్ఆర్ఆర్ కోసమే అంకితం కానున్నారు. కనీవినీ ఎరుగని విధంగా ఈ చిత్రం ఉండేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు.

 కళ్ళు చెదిరే పారితోషికం

కళ్ళు చెదిరే పారితోషికం

ఈ చిత్రానికి ఎన్టీఆర్, రాంచరణ్ పారితోషకం విషయంలో కూడా ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్, రాంచరణ్ తమ పారితోషకంతో పాటు ఈ చిత్రంలో లాభాలో కొంతమేర వాటా పొందనున్నట్లు తెలుస్తోంది. సినీవర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్, రాంచరణ్ కు చెరో 50 కోట్లు ముట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చిత్రానికి ఎక్కువరోజులు కాల్ షీట్స్ కేటాయించడంతో లాభాల్లో వాటా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

 బాహుబలి తరహాలోనే

బాహుబలి తరహాలోనే

బాహుబలి చిత్రానికి కూడా రాజమౌళి లాభాల్లో వాటా తీసుకున్నాడనే టాక్ వినిపించింది. అదే తరహాలో రాజమౌళి ఈ చిత్రానికి కూడా వాటా పొందనున్నాడట. 300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ విషయంలో రాజమౌళి ప్లానింగ్ ఏవిధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు.

అంతుచిక్కడం లేదు

అంతుచిక్కడం లేదు

రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుంచి కథపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బాక్సింగ్ నేపథ్యం ఉన్న కథ అని, స్వాతంత్ర పోరాటానికి సంబందించి కథ అని వార్తలు వచ్చాయి. కానీ రాజమౌళి ఎలాంటి కథతో రాబోతున్నాడో ఎవరికీ అంతుచిక్కడం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X