త్రివిక్రమ్ మాటలకు తలపట్టుకున్న తారక్.. ఆ సినిమా ఆగిపోయినట్లేనా?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మొత్తనికి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. అజ్ఞాతవాసి సినిమాతో ఊహించని డిజాస్టర్ అందుకున్న మాటల మాంత్రికుడు ఆ తరువాత చేసిన అరవింద సమేత కూడా అనుకున్నంతగా వర్కౌట్ కాలేదు. ఓ వర్గం ఆడియెన్స్ ని ఆ సినిమా నిరాశపరిచింది. అయితే ఫైనల్ గా అల.. వైకుంఠపురములో.. సినిమాతో త్రివిక్రమ్ కమర్షియల్ ఫార్మాట్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. చాలా చోట్ల ఆ సినిమా నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది.

నెక్స్ట్ కూడా..
నెక్స్ట్ సినిమాతో కూడా అదే స్థాయిలో సక్సెస్ అందుకోవాలని త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమాను ఫిక్స్ చేసుకున్నాడు. అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. కళ్యాణ్ రామ్, చినబాబు సంయుక్తంగా సినిమాను నిర్మించాలని ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. దాదాపు షెడ్యూల్స్ సెట్ చేసుకుంటున్న తరుణంలో లాక్ డౌన్ కారణంగా అన్ని పనులు మళ్ళీ మొదటికొచ్చాయి.

సినిమా క్యాన్సిల్...?
ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో ఎవరు ఊహించని విధంగా ఒక కామెంట్ వైరల్ గా మారింది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ప్రస్తుతానికి ఆగిపోయిందనే టాక్ వస్తోంది. దాదాపు 100కోట్ల బడ్జెట్ తో సెట్టయిన సినిమా సడన్ గా ఆగిపోవడం ఏమిటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ రూమర్స్ పై ఇంతవరకు చిత్ర యూనిట్ సైడ్ నుంచి క్లారిటీ అయితే రాలేదు.

త్రివిక్రమ్ మాట వల్లే సినిమా ఆగిందా?
సినిమాపై వస్తున్న రూమర్స్ ఆడియెన్స్ లో కన్ఫ్యూజన్ కి గురి చేస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా పనులు అయిపోవడానికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి, ఆ సినిమా పనులు అయిపోయిన తరువాతే ఎన్టీఆర్ తో కొత్త సినిమాను స్టార్ట్ చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేసుకుంటున్నాడట. ఇక ఆ గ్యాప్ లో వెంకటేష్ తో చేయాల్సిన ఒక సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు ఇటీవల త్రివిక్రమ్ తారక్ తో అన్నారట. ఇక తారక్ కాస్త సందేహంలో పడ్డట్లు తెలుస్తోంది.
Recommended Video

ప్లాన్ చేసుకుంటే..
ఎందుకంటే RRRకి తారక్ అవసరం బాగానే ఉన్నప్పటికీ ఆ పనులు అయిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. ప్లాన్ చేసుకుంటే RRR పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ పనులతో పాటు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ని కూడా ఫినిష్ చేయవచ్చు. కానీ త్రివిక్రమ్ మాత్రం సడన్ గా తన ప్లాన్ మార్చుకొని వెంకటేష్ తో సినిమా చేయాలని డిసైడ్ అయ్యారట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











