twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ విషయంలో నిర్మాతలను బయపెడుతున్న స్టార్ హీరోయిన్.. అందుకే సినిమాల్లేవ్?

    |

    టాలీవుడ్ లో కొత్తగా వచ్చే హీరోయిన్స్ కి ప్రస్తుతం అవకాశాలు ఎక్కువగానే వస్తున్నాయి. మిడియామ్ బడ్జెట్ లో తెరకెక్కే సినిమాల్లో రీసెంట్ గా వచ్చిన కథానాయికలనే ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇటీవల అలాంటి సినిమాల్లో మెహ్రీన్ పిర్జాదాకు అవకాశాలు ఎక్కువగానే వచ్చాయి. కానీ వచ్చిన అవకాశాలు ఈ బ్యూటీకి సక్సెస్ ఇవ్వలేదు. దానితో పాటు అమ్మడు తీరు కూడా అవకాశాలు లేకుండా చేశాయని కామెంట్స్ వస్తున్నాయి.

    బెస్ట్ ఎంట్రీ..

    బెస్ట్ ఎంట్రీ..

    కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ కెరీర్ మొదట్లో తన అందంతో బాగానే ఎట్రాక్ట్ చేసింది. ఆ సినిమా హిట్ కావడంతో వరుసగా సినిమా నిర్మాతలు ఆమె ముందు క్యూ కట్టారు. మిడియామ్ బడ్జెట్ సినిమాలకు మెహ్రీన్ తీసుకునే రెమ్యునరేషన్ కరెక్ట్ గా సెట్టవుతుందని నిర్మాతలు ముందుజాగ్రత్తగా మెహ్రీన్ ని ఎంచుకున్నారు.

    కెరీర్ మొదట్లోనే..

    కెరీర్ మొదట్లోనే..

    మెహ్రీన్ కౌర్ పిర్జాదా కెరీర్ మొదట్లోనే స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో వరుసగా సినిమాలకు సైన్ చేసింది. ఆమె దూకుడు చూసి అప్పట్లో స్టార్ హీరోయిన్స్ కి పోటీని ఇచ్చే మరో హీరోయిన్ వచ్చిందనే కామెంట్స్ వచ్చాయి. ఎందుకంటే నాని సినిమా తరువాత ఈ బ్యూటీ వరుసగా ఐదు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

     సక్సెస్ తరువాత..

    సక్సెస్ తరువాత..

    మహానుభావుడు , రాజా ది గ్రేట్ ద్వారా హిట్స్ అందుకొగానే మేహ్రీన్ రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచింది. అయితే నటనతో మాత్రం అమ్మడు పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది అనే కామెంట్స్ వచ్చాయి. ఇక అప్పుడే ఒక విషయంలో నిర్మాతలను ఈ బ్యూటీ బాగా ఇబ్బంది పెట్టినట్లు టాక్ వచ్చింది. అందువల్లే ఇప్పుడు అవకాశాలు లేకుండా చేశాయని కోలీవుడ్ లో కూడా రూమర్స్ వస్తున్నాయి.

     అందుకే..

    అందుకే..

    నిర్మాతలపై హోటల్స్ బిల్లులు, లాండ్రీ బిల్లులు అంటూ కొత్త భారాన్ని మోపినట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వస్తోంది. షూటింగ్ లొకేషన్స్ లకు కుటుంబ సభ్యులను కూడా తీసుకువచ్చెదట. వారి బిల్లులు కూడా నిర్మాతలే కట్టేవారని ఇండస్ట్రీలో టాక్ ఎక్కువగా వైరల్ అవ్వడంతో ఈ బ్యూటీ ఇమేజ్ ని కాస్త డ్యామేజ్ చేసినట్లు తెలుస్తోంది. 24 ఏళ్ళ వయసులో మెహ్రీన్ కెరీర్ పై తన ఆలోచన తీరు ఎఫెక్ట్ చూపించనట్లుగా విమర్శలు వస్తున్నాయి. పైగా వరుస అపజయాలు కూడా మెహ్రీన్ కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

    English summary
    The new heroines of Tollywood are now more than likely. Medium budget films are often seen as the main characters of the movie. Recently, Mehrene Pirzada's chances for such films have increased. But the opportunities that come with this beauty do not good. Comments have also been made that the sales have been done with no chance.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X