మాస్ రాజా రవితేజకు మరో దెబ్బ.. ఆ సినిమా ఆగిపోయిందా?
టాలీవుడ్ మాస్ రాజా రవితేజ ప్రస్తుతం సక్సెస్ కోసం చాలానే కష్టపడుతున్నాడు. ఒకప్పుడు మినిమమ్ బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న ఈ సినియర్ హీరో ఇప్పుడు మాత్రం వరుస అపజయాలతో సతమతమవుతున్నాడు. ఎలాంటి సినిమాలు చేసిన కూడా బాక్సాఫీస్ వద్ద క్లిక్కవ్వడం లేదు. కొన్నైతే భారీ స్థాయిలో నష్టాలను మిగులుస్తున్నాయి. దీంతో రవితేజ మార్కెట్ కూడా తగ్గిందని రూమర్స్ వస్తున్నాయి.
అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఈ మాస్ హీరో కొత్త సినిమా కూడా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఆగిపోయినట్లు తెలుస్తోంది. రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ ఒక తమిళ్ రీమేక్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుందని టాక్ రాగా ఇప్పుడు బడ్జెట్ కారణాల వల్ల మొత్తానికె సినిమా క్యాన్సిల్ అయినట్లు రూమర్స్ వస్తున్నాయి.

లాక్ డౌన్ కారణంగా షూటింగ్ స్టార్ట్ కాలేదనుకున్న అభిమానులకు ఈ వార్త కొంచెం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే వరుస ఫెయిల్యూర్స్ చూస్తున్న రవితేజకి మరో దెబ్బ పడటం ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నట్లు కామెంట్స్ వస్తున్నాయి. మరి ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. రవితేజ నెక్స్ట్ క్రాక్ సినిమాతో రానున్న విషయం తెలిసిందే. డాన్ శీను, బలుపు చిత్రాల దర్శకుడుగోపిచంద్ మలినేని ఆ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











