ఎన్టీఆర్, రాంచరణ్ ఫ్యాన్స్‌ని భయపెడుతున్న రూమర్.. అసలు వాస్తవం ఏంటి!

Recommended Video

RRR Movie Upadate: Story Behind The Rumour On Rajamouli's RRR | Filmibeat Telugu

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి తరువాత తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. దీనితో దేశ వ్యాప్తంగా ఈ క్రేజీ మల్టీస్టారర్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. గత నెలలోనే ఈ చిత్రం ప్రారంభమైంది. అప్పుడే తొలి షెడ్యూల్ కూడా పూర్తయిపోయింది. కళ్ళు చెదిరే యాక్షన్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి అనేక రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ న్యూస్ మాత్రం చరణ్, ఎన్టీఆర్ అభిమానులని కాస్త గందరగోళ పరిచే విధంగా ఉంది.

ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్

ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్

ఆర్ఆర్ఆర్ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. రెండవ షెడ్యూల్ మొదలయ్యేది సంక్రాంతి తరువాతే అని వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి నెల పైగా గ్యాప్ తీసుకోవడంతో సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ గురించి రూమర్స్ మొదలయ్యాయి. 300 కోట్ల భారీ బడ్జెట్ లో రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం కావడంతో ప్రతి ఒక్కరూ ఈ సినిమా విశేషాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

కథ ఇంకా పూర్తి కాలేదు అంటూ

కథ ఇంకా పూర్తి కాలేదు అంటూ

ఆర్ఆర్ఆర్ కథ ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదని, అందుకే రాజమౌళి ఫస్ట్ షెడ్యూల్ తరువాత ఇంత గ్యాప్ తీసుకున్నాడని జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. సాధారణంగా పూర్తి స్థాయిలో కథ సిద్ధం అయిన తరువాతే రాజమౌళి సెట్స్ పైకి వెళతాడు. కానీ ఆర్ఆర్ఆర్ విషయంలో ఎందుకు ఇలా జరుగుతోంది అనే చర్చ అభిమానుల్లో ఎక్కువవుతోంది. కథలో ఏదైనా చిన్న మార్పులు ఉంటే రాజమౌళి అండ్ టీం వాటిని షూటింగ్ దశలోనే పూర్తి చేస్తారు.

బాహుబలి తరహాలో

బాహుబలి తరహాలో

షూటింగ్ ప్రారంభం అయ్యాక కథ కోసమే నెల గ్యాప్ తీసుకున్నాడంటే.. ఆర్ఆర్ఆర్ షూటింగ్ మరింత ఆలస్యం కావడం ఖాయం అని ప్రచారం జరుగుతోంది. దీనితో బాహుబలి తరహాలో ప్రభాస్ ఇరుక్కుపోయినట్లు ఎన్టీఆర్, రాంచరణ్ ఇరుక్కుపోవడం ఖాయం అని కొందరు ప్రచారం చేస్తున్నారు. బాహుబలి రెండు భాగాలు పూర్తి కావడానికి దాదాపు ఐదేళ్ల సమయం పట్టింది. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని 2020 లో విడుదలకు ప్లాన్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారీ యాక్షన్ చిత్రం కావున ఆర్ఆర్ఆర్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

అసలు వాస్తవం

అసలు వాస్తవం

అభిమానులని గందరగోళపరిచేలా ఉన్న ఈ పుకార్లపై కొందరు క్లారిటీ ఇస్తున్నారు. రాజమౌళి తనయుడు కార్తికేయ వివాహం త్వరలో జరగనుంది. తనయుడి వివాహ ఏర్పాట్లు చేయడానికే రాజమౌళి ఏ గ్యాప్ తీసుకున్నారని అంటున్నారు. కథ ఎప్పుడో సిద్ధం అయిపోయింది. రాజమౌళి స్క్రిప్ట్ విషయంలో పక్కాగా ఉంటారు. ఇకపోతే షూటింగ్ దశలో కథలో చిన్న చిన్న మార్పులు చేయడం సాధారణమైన విషయమే అని అంటున్నారు.

దానయ్య నిర్మాణంలో

దానయ్య నిర్మాణంలో

ఈ చిత్రానికి డివివి దానయ్య నిర్మాత. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాల కోసమే అత్యధిక మొత్తం ఖర్చు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్వాతంత్రానికి పూర్వం పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందట. రాంచరణ్ బ్రిటిషు కాలం నాటి పోలీసుగా నటిస్తున్నట్లు, ఎన్టీఆర్ దొంగ పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X