»   » కొడుకు కోసం అల్లు అరవింద్ అతన్ని బలిచేయాలనుకున్నారా..?

కొడుకు కోసం అల్లు అరవింద్ అతన్ని బలిచేయాలనుకున్నారా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా నిర్మాత అల్లు అరవింద్ గురించి ఫిల్మ్ నగర్లో ఓ రూమర్ ప్రచారంలోకి వచ్చింది. అల్లు అరవింద్ దెబ్బకి ఓంకార్ తమ్ముడు అశ్విన్ బలయ్యే వాడే... కానీ తృటిలో తప్పించుకున్నాడు అని అంటున్నారు. ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ ఫిల్మ్ నగర్లో ఈ విషయం ఇపుడు హాట్ టాపిక్ అయింది. అయితే అల్లు అరవింద్ సన్నిహితులు మాత్రం ఈ పుకార్లను కొట్టివేస్తున్నారు.

తన తమ్ముడు అశ్విన్ హీరోగా ఓంకార్ రూపొందించిన 'రాజుగారి గది' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు సాధించింది. అశ్విన్ హీరోగా ప్రస్తుతం 'జత కలిసే' చిత్రం తెరకెక్కింది. చిన్న బడ్జెట్ తో రాకేష్ శశి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా హక్కులను వారాహి అధినేత సాయి కొర్రపాటి తీసుకుని విడుదల చేస్తున్నారు.

సాయి కంటే ముందు అల్లు అరవింద్ ఈ సినిమా చూసారని, సినిమా బాగా నచ్చి....మొత్తం రైట్స్ ని తనకు ఇచ్చేయమని అడిగారట అల్లు అరవింద్. మొత్తం రైట్స్ తీసుకోడం అంటే సినిమాపై పూర్తి హక్కులు పొందడమే. అంటే సినిమాను ఒకవేళ విడుదల చేయక పోయినా అడగటానికి వీలు లేని పరిస్థితి అసలు నిర్మాతలు, హీరోకు, దర్శకుడికి ఏర్పడుతుంది. అయితే అందుకు దర్శక నిర్మాతలు, హీరో అంగీకరించలేదని అంటున్నారు.

Shocking rumours about Jatha Kalise movie

ఈ సినిమా మొత్తం హక్కులు అల్లు అరవింద్ చేతికి వచ్చి ఉంటే ఆ సినిమాని విడుదల చేయకుండా.... తన తనయుడు అల్లు శిరీష్ తో మళ్లీ రీమేక్ చేసి, తెలుగుతో పాటు తమిళ్, మలయాళంలో విడుదల చేయాలని అల్లు అరవింద్ ప్లాన్ చేసేవారని అంటున్నారు. అయితే ఈ వార్తలను ఆయన సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు.

ఎవరో కావాలనే ఈ దుష్ప్రచారం మొదలు పెట్టారని...... సినిమాను కొని విడుదల చేయకుండా ఎవరూ ఉండరని, అలాంటి పరిస్థితి సినిమా పరిశ్రమలో ఉండదని అంటున్నారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని అంటున్నారు. అయితే ఈ పుకార్లపై అటు ‘జత కలిసే' యూనిట్ సభ్యులు కూడా స్పందించడం లేదు.

English summary
According to Film Nagar sources, makers of Jatha Kalise showed this film to Allu Aravind like a month back. Aravind was impressed with the story and he asked the makers to sell the negative rights, so that he cast shelve the film and produce it again with Allu Sirish. Since the first copy was already out, makers of Jatha Kalise hesitated to do so.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu