అనిల్ రావిపూడి - బాలయ్య కాంబోపై షాకింగ్ రూమర్.. అఖండ హిట్టయితేనే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫెయిల్యూర్స్ లేకుండా వరుసగా విజయాలతో దూసుకుపోతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి త్వరలోనే బాలకృష్ణతో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు అనిల్ కెరీర్ స్టార్ట్ చేయకముందే బాలకృష్ణ కోసం ఒక కథ సెట్ చేశాడు. రామారావు గారు అనే స్క్రిప్ట్ కూడా వినిపించాడు. కానీ ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టాల్సి వచ్చింది.
డిజైనర్ వేర్‌లో దేవతలా కనిపిస్తోన్న అంజనా రంగన్
ఇక వరుసగా విజయాలతో దూసుకుపోతున్న అనిల్ ఇటీవల మరొకసారి బాలయ్యను కలిసి మళ్ళీ అదే కథపై చర్చలు జరపగా ఆయన పాజిటివ్ గా స్పందించారట. అయితే వచ్చిన చిక్కల్లా సినిమాకు బడ్జెట్ గట్టిగానే అవుతుందట. దాదాపు 75కోట్ల వరకు ఖర్చు కావచ్చని రూమర్స్ వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని బాలకృష్ణ ఇప్పటివరకు ఆ రేంజ్ లో సినిమా చేయలేదు.

ప్రస్తుతం చేస్తున్న అఖండ సినిమాకు 70కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు టాక్ వస్తున్నప్పటికీ అందులో నిజమెంతో ఎవరికి తెలియదు. ఇక అఖండ హిట్టయితే మాత్రం బాలయ్య అనిల్ రావిపూడికి బడ్జెట్ విషయంలో పెద్దగా ఇబ్బంది ఉండదు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ లోనే వీరి సినిమా రూపొందవచ్చని టాక్. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి F3 సినిమాతో రెడీ అవుతున్న విషయం తెలిసిందే. వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న ఆ సినిమా అనంతరం వచ్చే ఏడాది బాలయ్య, అనిల్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రావచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications











