అఖండ బడ్జెట్ వల్ల తగ్గిన బాలయ్య రెమ్యునరేషన్.. టీజర్ దెబ్బకు మరికొంత డిమాండ్?
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాల బడ్జెట్ లెక్కలు రోజురోజుకు అంచనాలను మించిపోతున్నాయి. గతంలో ఒక సినిమా హిట్టయితే తదుపరి సినిమా బడ్జెట్ నిర్ణయించబడేది. కానీ ఇప్పట్లో మాత్రం ప్రాజెక్టు కాంబినేషన్ అంటూ బడ్జెట్ డోస్ పెంచేస్తున్నారు. ఇక బోయపాటి దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న అఖండ బడ్జెట్ కూడా ఇప్పుడు అదే తరహాలో పేరిగినట్లు సమాచారం. అందుకే రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువగా తీసుకున్నట్లు టాక్.

ఆ రెండు సినిమాలు..
కమర్షియల్ గా మాస్ యాక్షన్ సినిమాలను తెరకెక్కించడంలో మంచి టాలెంట్ ఉన్న బోయపాటి శ్రీను బాలయ్యతో చేసిన మొదటి సినిమా సింహా ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఆ తరువాత చేసిన లెజెండ్ సినిమా అంతకు మించి అనేలా బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. బాలయ్య కెరీర్ మొత్తంలో ఆ రెండు సినిమాలు అత్యదిక లాభాలను అందుకున్నాయి.

బోయపాటి హార్డ్ వర్క్
ఇక మూడవసారి అలాంటి కాంబినేషన్లో సినిమా వస్తే తప్పకుండా పవర్ఫుల్ గా ఉంటుందని జనాల్లో ఒక నమ్మకమైతే ఉంది. ఇక ప్రేక్షకుల అంచనాలను దృష్టిలో ఉంచుకొని బోయపాటి అఖండ సినిమాను ఎంతో హార్డ్ వర్క్ తో తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల వచ్చిన టీజర్ ఏ రేంజ్ లో బజ్ క్రియేట్ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

అఖండ బడ్జెట్
బాలయ్య బాబు అఘోరా పాత్రలో హై వోల్టేజ్ లుక్కుతో షాక్ ఇచ్చాడనే పాజిటివ్ కామెంట్స్ ఎన్నో వస్తున్నాయి. ఆ టీజర్ కు యూ ట్యూబ్ లో ఇప్పటికే 50మిలియన్ల వ్యూవ్స్ రావడం విశేషం. ఇక సినిమా కోసం దాదాపు 70కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు టాక్ వస్తోంది. అయితే ఇంత పెద్ద హై బడ్జెట్ సినిమాకు బాలకృష్ణకు చాలా తక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారట.

బోయపాటి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట
బాలకృష్ణ ఈ సినిమా కోసం ఇప్పటివరకు కేవలం 7కోట్లు మాత్రమే అందుకున్నట్లు టాక్ వస్తోంది. బడ్జెట్ ఎక్కువవవ్వడం వలన నిర్మాతలు ముందే అనుకున్నంత బడ్జెట్ ఇవ్వలేమని డైరెక్ట్ గా చెప్పినట్లు రూమర్స్ కూడా వస్తున్నాయి. బోయపాటి అయితే ఇంతవరకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట.
Recommended Video

బాలయ్య మరికొంత డిమాండ్
సినిమా విడుదల తరువాత నాన్ థియేట్రికల్ బిజినెస్ అలాగే బాక్సాఫీస్ వద్ద ప్రాఫిట్స్ ను బట్టి షేర్స్ ఇస్తారని సమాచారం. ఇక ఇటీవల టీజర్ హిట్టవ్వడంతో బాలకృష్ణ మరొక మూడు కోట్ల వరకు అడిగినట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా అఖండ సినిమా కూడా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











