విజయ్ భార్యకు న్యాయం చేయాలి అంటూ కామెంట్స్.. ఆమెతో రెండో పెళ్లి వార్తలు.. ఎలా స్టార్ట్ అయ్యాయంటే?

తమిళ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు అత్యధిక స్థాయిలో మార్కెట్ ఉన్న హీరోలలో దళపతి విజయ్ ఒకరు. ఈ స్టార్ హీరో ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద ఈజీగా 200 కోట్ల వరకు కలెక్షన్స్ వస్తాయి అని ఇటీవల వారిసు సినిమాతో మరోసారి అర్థమయింది. అయితే ఇప్పుడు విజయ్ పై ఊహించని విధంగా కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. అతని భార్యకు న్యాయం చేయాలి అంటూ సోషల్ మీడియాలో వివిధ రకాల నెగిటివ్ ట్యాగ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఇక విజయ్ ను ఒక హీరోయిన్ వలలో వేసుకుంది అని ఆమెను పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు అని కూడా కథనాలు వెలువడుతున్నాయి. అసలు ఇంతకు ఈ వార్తలు ఎలా వైరల్ అయ్యాయి.. అనే వివరాల్లోకి వెళితే..

నెగిటివ్ ట్యాగ్స్ ట్రెండ్

నెగిటివ్ ట్యాగ్స్ ట్రెండ్

ప్రస్తుతం సోషల్ మీడియాలో విజయ్ కు అలాగే ఇంకొక హీరోయిన్ కి మధ్యలో డేటింగ్ కొనసాగుతోంది అని చాలా రకాల కథనాలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా విజయ్ పై కొన్ని నెగటివ్ ట్యాగ్స్ కూడా ట్రెండ్ అవుతూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంతే కాకుండా అతని భార్య కు న్యాయం చేయాలి అని జస్టిస్ ఫర్ సంగీత అనే హ్యాక్ ట్యాగ్ కూడా ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.

 ఫ్యాన్స్ ఆగ్రహం

ఫ్యాన్స్ ఆగ్రహం

సాధారణంగా విజయ్ అయితే ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ఉండేందుకు ఇష్టపడుతూ ఉంటాడు. వీలైనంతవరకు కాంట్రవర్సీ విషయాలపై కూడా పెద్దగా స్పందించడు. తన సినిమాలకు సంబంధించిన విషయాల గురించి కూడా విజయ్ పెద్దగా మాట్లాడడు. ఇక ఇప్పుడు ఒక హీరోయిన్ తో అతను డేటింగ్ చేస్తున్నాడు అని దారుణంగా కథనాలు వైరల్ అయ్యేలా చేస్తూ ఉండడంపై విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

హీరోయిన్ గా అవకాశాలు ఇస్తూ..

హీరోయిన్ గా అవకాశాలు ఇస్తూ..

తెలుగు తమిళ ఇండస్ట్రీలో మంచి హీరోయిన్ గా గుర్తింపు అందుకున్న ఒక నటితో విజయ్ ప్రేమలో ఉన్నాడు అని.. గత కొంతకాలంగా వీరు పెళ్లి చేసుకోవాలని చర్చించుకుంటున్నారని కూడా కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. ఆమెతో విజయ్ ఇదివరకే రెండు సినిమాలు చేశాడు. అయితే ఇప్పుడు ఆ ప్రేమ మరింతగా ముదరడంతో విజయ్ ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు వచ్చేలా కూడా నిర్మాతలతో మాట్లాడుతున్నట్లుగా ఒక టాక్ వినిపిస్తోంది.

విజయ్ భార్య సీరియస్

విజయ్ భార్య సీరియస్

విజయ్ తన మేనేజర్ ద్వారా ఆ హీరోయిన్ కు చాలా క్లోజ్ అవుతున్నాడు అని ఇప్పుడు ఆ హీరోయిన్ తో సినిమాలు కూడా నిర్మించేలా విజయ్ బ్యాగ్రౌండ్ లో పెట్టుబడులు పెడుతున్నాడు అన్నట్లుగా కూడా ఒక వైబ్ సైట్ లో కథనాలు వెలుపడ్డాయి. అయితే విజయ్ సతీమణి సంగీత ఈ విషయంలో విజయ్ పై సీరియస్ అవుతూ మేనేజర్ ను పనిలో నుంచి తీసేయాలని కూడా హెచ్చరికలు చేసినట్లు వార్తలు ప్రచారం చేస్తున్నారు.

 ఫేక్ వార్తలు

ఫేక్ వార్తలు

అయితే కావాలనే ఈ తరహాలో ఇతర హీరోల అభిమానులు విజయ్ పై ఫేక్ వార్తలను క్రియేట్ చేస్తున్నారు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక సదరు వెబ్ సైట్ పై కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇక ఇప్పుడు తెలుగులో కూడా ఈ వార్తలు జోరుగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదు అని తెలుస్తోంది. విజయ్ తన సినిమాలు తప్పించి ఇతర విషయాలపై పెద్దగా పట్టించుకోడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక ఆ హీరోయిన్ కూడా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళుతున్నట్లుగా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X