Don't Miss!
- News పైసాకు పనికిరాని వ్యక్తి పవన్ - చంద్రబాబు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అల్లు అర్జున్ కొరటాల శివ మూవీపై అనుమానాలు.. అసలు క్లారిటీ వచ్చేసింది
ఒక సినిమా ఎనౌన్స్మెంట్ వచ్చింది అంటే అది సెట్స్ పైకి వచ్చే వరకు నమ్మకం ఉండదు. ఇక సినిమా షూటింగ్ కొనసాగుతున్నా కూడా సడన్ గా బ్రేకులు పడుతుంటాయి. ఇటీవల అభిమానులను ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసిన ఎన్టీఆర్ 30 మొత్తానికి భారీ మార్పులను క్రియేట్ చేసింది. అందుకు సంబంధించిన రూమర్స్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విదంగా బిగ్గెస్ట్ కాంబినేషన్ క్యాన్సిల్ అవ్వడం అందరిని షాక్ కు గురి చేసింది.
RRR కారణంగా వాయిదా
త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఆల్ మోస్ట్ షూటింగ్ స్టార్ట్ అని అనుకున్న సమయంలో సినిమా క్యాన్సిల్ అయ్యింది. గత ఏడాది నుంచి చర్చల దశల్లో ఉన్న ఈ కాంబో RRR కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అలాగే స్క్రిప్ట్ కూడా ఎన్టీఆర్ కు అంతగా నచ్చలేదు అనే కామెంట్స్ కూడా వచ్చాయి.
భవిష్యత్తులో త్రివిక్రమ్ సినిమా
ఇక RRR లాంటి సినిమా అనంతరం మళ్ళీ మరో పాన్ ఇండియా లాంటి కథతోనే రావాలని ఎన్టీఆర్ ఆలోచించడం వలన త్రివిక్రమ్ కథను పక్కన పెట్టి ఉండవచ్చని రూమర్స్ కూడా వచ్చాయి. ఇక త్రివిక్రమ్ తో అయితే సినిమా క్యాన్సిల్ అవ్వలేదనే టాక్ కూడా వస్తోంది. తప్పకుండా తారక్ భవిష్యత్తులో త్రివిక్రమ్ సినిమా చేస్తాడని తెలుస్తోంది.
బన్నీ సినిమా క్యాన్సిల్?
ఇక ఇదిలా ఉండగా.. తారక్ 30వ సినిమాకు దర్శకుడు కొరటాల శివ లైన్ లోకి రావడంతో మరోవైపు అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాపై కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. పుష్ప అనంతరం వీలైనంత త్వరగా కొరటాలతో మరో సినిమాను పూర్తి చేయాలని అల్లు అర్జున్ పర్ఫెక్ట్ ప్లాన్ రేడి చేసుకున్నడు. ఇక కొరటాల తారక్ వైపు తిరగడంతో బన్నీ సినిమా క్యాన్సిల్ అయినట్లు టాక్ వస్తోంది.
Recommended Video
ఎన్టీఆర్ తరువాతే..
అసలు నిజం ఏమిటంటే.. అల్లు అర్జున్ కొరటాల శివ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వలేదట. ఎన్టీఆర్ 30ను ఏప్రిల్ లో రిలీజ్ చేసి ఆ తరువాత వెంటనే అల్లు అర్జున్ సినిమాను స్టార్ట్ చేస్తారట. ఇక పుష్ప కూడా ఆగస్ట్ లో వచ్చేలా లేదని టాక్ వస్తోంది. ఆ సినిమాకు మరింత టైమ్ కావాలి కాబట్టి బన్నీకి కూడా కొరటాలను కలిసే టైమ్ లేదు. అందుకే ఎన్టీఆర్ సినిమా అయిపోయిన తరువాత కూల్ గా వారి సినిమాను మొదలు పెట్టనున్నట్లు సమాచారం.