క్రాక్ ఓటీటీ రిలీక్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు రాబోతోందంటే?
సినిమా ఇండస్ట్రీలో ఒక డీల్ సెట్టయ్యింది అంటే ఎవరి ప్రయోజనాలు వారే చూసుకుంటారు. ఇక క్రాక్ విడుదలైన రోజు కొన్ని ఆర్థిక వివాదాలు జరగడానికి కూడా అదే కారణం. పలు కోర్టు కేసులను కూడా ఎదుర్కొన్న ఈ సినిమా మొత్తానికి థియేటర్స్ లోకి వచ్చి చిత్ర యూనిట్ సబ్యులకు ఒక మంచి బూస్ట్ ఇచ్చింది. క్రాక్ సినిమా కలెక్షన్స్ పరంగా ఇప్పటికే ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేసింది.
కేవలం 50% సిట్టింగ్ కెపాసిటీతో థియేటర్స్ నడిచినప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. దాదాపు సినిమా తెలుగు రాష్ట్రాల్లో పెట్టిన పెట్టుబడికి ప్రాఫిట్ జోన్ లోకి వచ్చినట్లు సమాచారం. ఇక సినిమాను ఓటీటీలో వీలైనంత త్వరగా విడుదల చేయాలని నిర్మాత అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ఆహా యాప్ కోసం భారీ ధరకు కొనుగోలు చేశారు.

ఇక రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఆహా యాప్ లో విడుదల చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ డేట్ మిస్సయితే ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. సినిమా హడావుడి తగ్గకముందే విడుదల చేస్తే మంచి క్రేజ్ దక్కుతుందని ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. చూస్తుంటే ఓటీటీలో కూడా క్రాక్ భారీ స్థాయిలో వ్యూవ్స్ అందుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











