Radhe shyam Event కోసం నవీన్ పొలిశెట్టి ఎంత తీసుకున్నాడు.. అసలు నిజం ఏమిటంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది అని ఇటీవల విడుదలైన రాధేశ్యామ్ సినిమా ట్రైలర్ తో మరోసారి అర్థమయింది. ఈ సినిమా అభిమానుల అంచనాలకు ఏమాత్రం తక్కువ కాకుండా రూపొందుతోందని చిత్ర యూనిట్ క్లారిటీ అయితే ఇచ్చేసింది. ఇక సినిమా వేడుకకు సంబంధించి ప్రస్తుతం మీడియాలో ఒక రూమర్ అయితే గట్టిగానే వైరల్ అవుతోంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నవీన్ పోలిశెట్టి పారితోషికం ఎంత తీసుకున్నాడు అనే విషయంలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అసలు నిజం ఏమిటి అనే విషయంలోకి వెళితే..

నవీన్ పోలిశెట్టి లేకపోతే..
రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎంత ఖర్చు చేశారో తెలియదు గాని అందరికంటే ఎక్కువగా నవీన్ పోలిశెట్టి తన హోస్టింగ్ తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ వేడుక కోసం నవీన్ పోలిశెట్టిని హోస్టింగ్ చేయమని ఎవరు నియమించారు.. అసలు ఆ ఆలోచన ఎవరిది అనే విషయంలో అనేక రకాల సందేహాలు వెలువడుతున్నాయి. ఒక విధంగా నవీన్ పోలిశెట్టి లేకపోతే రాధేశ్యామ్ ఈవెంట్ చాలా నీరసంగా ఉండేది అని అర్ధమైపోయింది.

గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్
రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా అన్ని భాషల వారిని ఒకేసారి ఆకట్టుకునే విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా కన్నడం తమిళం హిందీ ఆడియన్స్ కూడా సినిమా చేరుకోవాలని ఒకేసారి ఐదు భాషల్లో ట్రైలర్ ను కూడా విడుదల చేశారు.

సందడిగా..
ఇక సినిమా వేడుకలు అందరికంటే ఎక్కువగా నవీన్ పోలిశెట్టి చాలా హైలెట్ అయ్యాడనే చెప్పాలి. అతని కంటే ముందే యాంకర్ రష్మితో ఈవెంట్ మొదలైనప్పటికీ నవీన్ పోలిశెట్టి తనదైన శైలిలో కొనసాగించాడు. రెబల్ స్టార్ ప్రభాస్ తో కూడా చాలా స్నేహంగా కనిపిస్తూ ఆటపట్టించాడు. వేడుకకు వచ్చిన అతిథులను కూడా అనేక రకాల ప్రశ్నలు అడుగుతూ చాలా ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నం చేశాడు.

తొందరగానే ముగించిన ప్రభాస్
నవీన్ పోలిశెట్టి పంచ్ లకు అలాగే అతని కామెడీ టైమింగ్ కి కూడా అందరూ ఎంతగానో ఆకర్షితులయ్యారు. నిజానికి ప్రభాస్ కూడా చివర్లో అనుకున్నంత స్థాయిలో ఏమీ మాట్లాడలేకపోయాడు సినిమా చాలా బాగుంటుంది అని అలాగే ట్విస్టులు కూడా చాలా ఉంటాయి అని రెండు మాటలు మాట్లాడి తనదైన శైలిలో ముగించాడు. కానీ అంతకంటే ముందే నవీన్ పోలిశెట్టి మంచి ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నం చేశాడు.

నాగ్ అశ్విన్ సలహాతో..
నవీన్ పోలిశెట్టి కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా హిందీ ప్రేక్షకులు కూడా బాగా సుపరిచితమే. అతను చేసిన హిందీ సినిమా చిచోరేతో బాలీవుడ్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. జాతి రత్నాలు సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచాడు. కాబట్టి అతని టాలెంట్ గురించి తెలిసి దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ కు సలహా ఇచ్చాడట. అయితే తప్పకుండా ప్రమోషన్లో ఉపయోగపడతాడు అని చెప్పడంతో ప్రభాస్ కూడా ఏ మాత్రం ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

ఎలాంటి పేమెంట్ తీసుకోకుండా..
జాతి రత్నాలు సమయంలో ప్రభాస్ కూడా ట్రైలర్ లాంచ్ చేసి మంచి సపోర్ట్ చేశాడు. అందుకే డార్లింగ్ సినిమా కోసం తన వంతు సహాయం చేశాడు. ఈ వేడుకకు నవీన్ పోలిశెట్టి హోస్ట్ గా చేయడానికి ఇలాంటి రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదట. ఇప్పటికే యూవీ క్రియేషన్స్ లో సినిమా చేసేందుకు ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు. ప్రభాస్ తో స్నేహాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కేవలం మంచి బాండింగ్ కోసమే ఈవెంట్ ను విజయవంతం చేసేందుకు ప్రయత్నం చేశాడట. ఈవెంట్ కోసం అతనికి భారీ స్థాయిలో పేమెంట్ ఇచ్చినట్లు వస్తున్న కథనాలలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











