బన్నీ ప్లాన్‌తో ఎన్టీఆర్ సినిమాపై అనుమానాలు.. ఆ పాన్ ఇండియా సినిమాకు బ్రేక్?
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కాలం తరువాత బిగ్ బడ్జెట్ కాంబినేషన్స్ సెట్స్ పైకి వస్తున్నాయి. అగ్ర దర్శకులు, అగ్ర హీరోల కలయికలో పెద్ద సినిమాలు రావడమే అభిమానులకు పెద్ద గిఫ్ట్ అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమాలు రెడీ అవుతున్నాయి. ఇక కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ హడావుడి చూస్తుంటే టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఫిక్స్ అయ్యేలా ఉన్నాడని టాక్ వస్తోంది.

ప్రశాంత్ నీల్.. అదే ట్రెండ్..
రాజమౌళి ట్రెండ్ సెట్ చేయడంతో సుకుమార్, పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు మొత్తం పాన్ ఇండియా బాట పట్టారు. తప్పకుండా తెలుగు సినిమాలకు నేషనల్ లెవెల్లో ఆదరణ దక్కుతుందని పవర్ఫుల్ గా రెడీ అవుతున్నారు. ఇక కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. KGF హిట్టు తరువాత స్టార్ హీరోలు అతనితో సినిమా చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఎన్టీఆర్ తో న్యూ మూవీ
KGF 2 రిలీజ్ కు సిద్ధమవుతుండగానే మరోవైపు ప్రభాస్ తో సలార్ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రెండు సినిమాలను రిలీజ్ చేయాల్సిన బాధ్యతను మోస్తున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎలాంటి టెన్షన్ లేకుండా భవిష్యత్తు కథలను కూడా హ్యాపీగా రెడీ చేసుకుంటున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తో ఒక స్టోరీ లైన్ అయితే అనుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఆ కాంబోని సెట్స్ పైకి తీసుకు రావాలని చూస్తోంది.

ఎన్టీఆర్ సినిమాపై అనుమానాలు
అయితే ఇటీవల సడన్ గా ప్రశాంత్ నీల్, బన్నీని కలవడంతో కొన్ని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. గీత ఆర్ట్స్ ఆఫీస్ లో ఈ ఇద్దరు కూడా గంటల తరబడి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. పుష్ప అనంతరం బన్నీ మరిన్ని పాన్ ఇండియా సినిమాలను చేస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ప్రశాంత్ నీల్, బన్నీకి స్టోరీ లైన్ వినిపించినట్లు సమాచారం. అయితే ఎన్టీఆర్ తో సినిమా కంటే ముందే బన్నీతో సినిమా చేస్తాడా అనే అనుమానాలు ఎక్కువవుతున్నాయి.

బన్నీ మాత్రం ఇప్పట్లో దొరికేలా లేడు
ఎన్టీఆర్ RRR అనంతరం త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమాను స్టార్ట్ చేయనున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ తో చేయాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడు బన్నీ మీటింగ్ తో ప్లాన్ చేంజ్ చేసి ఉండొచ్చని అనుమానం వస్తోంది. అయితే బన్నీ మాత్రం ఇప్పట్లో దొరికేలా లేడు. పుష్ప అయిపోగానే కొరటాల సినిమాను స్టార్ట్ చేయాల్సి ఉంది. అలాగే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ కూడా ఉంది. సో ఇప్పట్లో అయితే బన్నీ, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఉండకపోవచ్చని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











