మొత్తానికి పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబో సెట్టయినట్లే.. ఎప్పుడంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొత్తానికి వకీల్ సాబ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఒక సాలీడ్ హిట్టయితే అందుకున్నాడు. ఇక అందరి ఫోకస్ ఇప్పుడు ఆయన తదుపరి సినిమాలపై పడింది. ఇప్పుడే ఈ రేంజ్ లో ఉంటే ఇక రానున్న రోజుల్లో మరిన్ని పవర్ఫుల్ అండ్ యాక్షన్ సినిమాలతో రాబోతున్నాడు. మరి ఆ సినిమాలు ఇంకా ఏ స్థాయిలో ఆకట్టుకుంటాయో అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా పవన్ ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అప్పుడే ప్రాఫిట్స్ లోకి వచ్చేసింది

అప్పుడే ప్రాఫిట్స్ లోకి వచ్చేసింది

టాలీవుడ్ ఇండస్ట్రీలో లాక్ డౌన్ అనంతరం విడుదలైన బిగ్గెస్ట్ మూవీ వకీల్ సాబ్. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల మార్క్ ను అందుకున్న పవర్ స్టార్ రెండవ వారంలోకి ప్రవేశించింది. సినిమా నాన్ థియేట్రికల్ గానే నిర్మాత దిల్ రాజుకు సగం డబ్బును వెనక్కి ఇచ్చేసింది. ఇక థియేట్రికల్ గా మొదటి వీకెండ్ లోనే ప్రాఫిట్స్ లోకి తెచ్చేసింది.

పొలిటికల్ ఇబ్బందులు వచ్చినప్పటికీ

పొలిటికల్ ఇబ్బందులు వచ్చినప్పటికీ

గతంలో ఎప్పుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ సినిమాకు కొన్ని పొలిటికల్ ఇబ్బందులు కూడా తలెత్తాయి. ఆంద్రప్రదేశ్ లో సినిమా టికెట్స్ రేట్లు సడన్ గా తగ్గించడం వలన అత్యదిక స్థాయిలో కలెక్షన్స్ దక్కలేదు. ఏపీ ప్రభుత్వం కావాలనే అలా చేసినట్లు అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి. ఒక విధంగా ఎన్ని ఎత్తుగడలు వేసినా కూడా సినిమా పాజిటివ్ టాక్ తో 100కోట్ల మార్క్ ను అందుకుంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో సినిమా

త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో సినిమా

ఇక బాక్సాఫీస్ వద్ద పవన్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదని చాలా క్లారిటీగా అర్ధమయ్యింది. దీంతో ఆయనతో సినిమాలు చేయబోయే దర్శక నిర్మాతలు మరింత పవర్ఫుల్ గా రెడీ అవుతున్నారు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పవన్ కళ్యాణ్ తో వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది.

పవన్ తో మరో మంచి సినిమా చేయాలని

పవన్ తో మరో మంచి సినిమా చేయాలని

ఇదివరకే వీరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా - అత్తారింటికి దారేది సినిమాలు బాక్సాఫీస్ వద్ద పవర్ఫుల్ హిట్స్ గా నిలిచాయి. ఇక ఆజ్ఞాతవాసి మాత్రం డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమా తరువాత పవన్ తో మరో మంచి సినిమా చేయాలని త్రివిక్రమ్ చాలా రోజులుగా ఆలోచిస్తున్నాడు. ఇక మొత్తానికి ఒక స్టోరీ లైన్ ను ఫిక్స్ చేసుకున్నట్లు టాక్ వస్తోంది.

మహేష్ తరువాత..

మహేష్ తరువాత..

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ సినిమాకు త్రివిక్రమ్ డైలాగ్స్ రాస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ సినిమా క్యాన్సిల్ అవ్వడంతో మహేష్ బాబూతో సినిమా చేయాలని చూస్తున్న త్రివిక్రమ్ ఆ తరువాత పవన్ కళ్యాణ్ ను కూడా లైన్ లో పెట్టె అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది వీరి కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి రావచ్చని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X