షూటింగ్ మధ్యలోనే ప్రభాస్ సినిమాకు భారీ నష్టాలు.. ఇలా అయితే కష్టమే!
రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది ఆడియెన్స్ ముందుకు వచ్చేలా లేడు. బాహుబలి తరువాత అయినా స్పీడ్ గా సినిమాలు చేస్తాడేమో అనుకుంటే సాహో తరువాత కూడా అదే తరహాలో వెళుతున్నాడు. ఇక నెక్స్ట్ సినిమాకు సంబంధించిన ఒక షాకింగ్ రూమర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ 20వ ప్రాజెక్టుకి సంబంధించి కొన్ని కోట్ల రూపాయలు వృధా అయినట్లు తెలుస్తోంది.

ప్రభాస్ మళ్ళీ అలానే చేస్తున్నాడు..
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కనీసం ఏడాదికో సినిమా చేస్తున్నారు. అవసరం అయితే తప్ప రెండేళ్లు గ్యాప్ తీసుకోవడం లేదు. అయితే ప్రభాస్ మాత్రం ఊహించని విధంగ గ్యాప్ మరీ ఎక్కువగా తీసుకుంటున్నాడు. అసలైతే సాహో అనంతరమే పెద్ద సినిమాలకు కొన్నేళ్ల పాటు దూరంగా ఉండి చాలా తొందరగా చిన్న బడ్జెట్ లోనే సినిమాలు చేస్తానని అన్నాడు.

మరోసారి రీ షూట్..?
కానీ ప్రభాస్ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే కనీసం వచ్చే ఏడాదైనా వస్తాడా లేదా అని టాక్ వస్తోంది. ఎందుకంటే ప్రభాస్ 20వ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఒక రూమర్ ఆడియెన్స్ ని షాక్ కి గురి చేస్తోంది. ఇదివరకే 20వ సినిమాకు సంబంధించిన కొంత షూటింగ్ ని పూర్తి చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు అందులో చాలా వరకు మళ్ళీ రీ షూట్ చేయాలని ఫిక్స్ అయ్యిందట.

మరింత ఎక్కువ బడ్జెట్లో..
ముందు చేసిన ఎపిసోడ్స్ కోసం చిత్ర యూనిట్ భారీ స్థాయిలో ఖర్చు చేసి నిర్మించింది. ఇక ఇప్పుడు అవి కరెక్ట్ గా లేవని మరింత ఎక్కువ బడ్జెట్ లొకేషన్స్ వేసి సరికొత్తగా ఈ సినిమాను రీ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో సినిమాకు ఊహించని విదంగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇంకా సినిమా బిజినెస్ డీల్స్ అయితే క్లోజ్ కాలేదు.
Recommended Video

మళ్ళీ రిస్క్ అవసరమా?
కానీ ఈ విధంగా సాహో కోసం ఖర్చు చేసినట్లుగా హై బడ్జెట్ తో రిస్క్ చేయడం అనేది షాకింగ్ విషయమనే చెప్పాలి. సాహో వలన నిర్మాతలు కేవలం నష్టాల నుంచి తప్పించుకున్నారు అంతే. పాన్ ఇండియా పేరుతో తొందరపడి బడ్జెట్ లెక్కలు మితిమిరిపోతున్నాయి. నెక్స్ట్ ప్రాజెక్టు విషయంలో కూడా యూవీ క్రియేషన్స్ ఈ విధంగా తొందరపడటం కాస్త రిస్క్ తో కూడుకున్న పనే. మరి ఆ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











