Don't Miss!
- News ఏపీ, తెలంగాణలో అత్యంత ధనవంతురాలు ఆమే
- Finance Elon Musk: ఎలోన్ మస్క్ పర్యటన వాయిదా..ఎందుకంటే..!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
RRR వాయిదాపై ఎన్నో అనుమానాలు.. అసలు క్లారిటి ఇచ్చేశారు.. అనుకున్నట్లే అవుతోంది!
టాలీవుడ్ ఇండస్ట్రీలో అన్ని వర్గాల ఆడియెన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో RRR ఒకటి. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా తమిళ్ హిందీలో కూడా సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ రిలీజ్ డేట్ పై కొన్ని వార్తలు అభిమానులను కన్ఫ్యూజన్ కు గురి చేస్తున్నాయి. అయితే సినిమా అనుకున్న డేట్ కు వస్తుందా రాదా అనే విషయంలో ఎట్టకేలకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.
ఊహించడం చాలా కష్టం
బహుబలి అనంతరం రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కాబట్టి బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించడం చాలా కష్టం. ఇప్పటివరకు ఒక లెక్క.. RRR తో మరో లెక్క అనేలా కలెక్షన్స్ ఉంటాయని చెప్పవచ్చు. దాదాపు 450కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పనులకు మధ్యలో చాలా బ్రేకులు పడ్డాయి. కరోనా కూడా ఇబ్బంది పెట్టింది.
మరింత ఆలస్యం అయ్యింది
సాధారణంగా దర్శకుడు రాజమౌళి చెప్పిన సమయం కంటే మరికొంత సమయాన్ని ఎక్కువ తీసుకోవడం అందరికి తెలిసిన విషయమే. కానీ RRR విషయంలో హీరోల గాయాల కారణంగా అలాగే కరోనా తాకిడికి మరింత ఆలస్యం అయ్యింది. రెండు రిలీజ్ డేట్లు దాటి ఫైనల్ గా అక్టోబర్ 13న రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు.
రిలీజ్ డేట్ పై అనుమానాలు
అయితే ఇప్పుడు కూడా ఆ డేట్ కు సినిమా వస్తుందా లేదా అనే విషయంలో అభిమానులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే జక్కన్నకి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఇంకా ఎక్కువ సమయం కావాల్సి వస్తోందని పైగా కరోనా తాకిడి ఎక్కువవ్వడం కూడా ఆందోళన కలిగిస్తోందని అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.
Recommended Video
అనుకున్నట్లుగానే..
ఇక రీసెంట్ సినిమాకు సంబంధించిన కొంతమంది యూనిట్ సభ్యులు చెప్పిన విషయం ప్రకారం సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశం లేదట. దర్శకుడు రాజమౌళి అనుకున్న డేట్ ను టార్గెట్ గా పెట్టుకొని షూటింగ్ చేటున్నారాట. ఇక అక్టోబర్ 13న రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల ఉగాది సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో కూడా మెన్షన్ చేశారు. దీంతో అభిమానులకు ఒక క్లారిటీ వచ్చినట్లయ్యింది.