అయ్యో పాపం.. మహేష్ పెమెంట్ తగ్గించలేక దర్శకుడి రెమ్యునరేషన్ తగ్గించారట!
బాక్సాఫీస్ వద్ద సక్సెస్ పడితే చిన్న దర్శకులు, మిడియామ్ దర్శకులు కోరుకునే బలమైన కోరిక ఒక్కటే. ఎలాగైనా నెక్స్ట్ స్టార్ హీరోతో సినిమా చేయాలని అనుకుంటారు. మార్కెట్ పరంగా ఎదగడమే కాకుండా ఆ తరువాత ఇష్టమైన సినిమాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇకపోతే ఇటీవల అదే తరహాలో మహేష్ బాబుతో వర్క్ చేసే ఛాన్స్ దక్కించుకున్న దర్శకుడికి ఒక చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది.

ఆ ఈనిమాతోనే..
దర్శకుడు పరశురామ్ గీత గోవిందం సినిమాతో భారీ బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. గతంలో చాలా సినిమాలు చేసినప్పటికీ పరశురామ్ కెరీర్ అదే సినిమాతో యూ టర్న్ తీసుకుంది. మొదట ఆ సినిమాకు రెమ్యునరేషన్ చాలా తక్కువ ఇచ్చినప్పటికీ సినిమా హై ప్రాఫిట్స్ లోకి వచ్చింది కాబట్టి 7కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారు.

మహేష్ సినిమా కోసం..
ఆ సినిమా హిట్ కావడంతో స్టార్ హీరోల నుంచి మనోడికి చాలా ఆఫర్స్ వచ్చాయి. దీంతో దర్శకుడు మహేష్ బాబుతో సర్కారు వారి పాట అనే సినిమాను స్టార్ట్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఇటీవల ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. నాగ చైతన్యతో ఒక ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నప్పటికి మహేష్ సినిమా కోసం దర్శకుడు చైతు ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టి వచ్చాడు.

రేటు మారింది..
అయితే ఇటీవల సర్కారు వారి పాట సినిమా షెడ్యూల్స్ సెట్స్ చేసుకుంటున్న సమయంలో నిర్మాతలు దర్శకుడికి ఊహించని షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సర్కారు వారి పాట కోసం పరశురామ్ 9 నుంచి 10కోట్ల రెమ్యునరేషన్ అందుకునే ఛాన్స్ ఉందని ఒక టాక్ అయితే వచ్చింది. కానీ ఇప్పుడు అనుకున్న రేటు ఇవ్వడం లేదట. లాక్ డౌన్ కారణంగా బడ్జెట్ లో మార్పులు జరిగాయట.
Recommended Video

రెమ్యునరేషన్ కట్ చేశారా..!
సినిమాను ఎక్కువగా సెట్స్ వేసి నిర్మించాలని రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలు టెక్నీషియన్స్ తో అలాగే నటీనటులతో చర్చలు జరిపారట. ఎవరివి తగ్గించారో తెలియదు గాని మహేష్ బాబు రేటు మాత్రం కొంచెం కూడా తగ్గలేదట. ఇక ఆ ఎఫెక్ట్ దర్శకుడిపై పడినట్లు టాక్ వస్తోంది. చేసేదేమీ లేక 2కోట్ల వరకు కట్ చేశారని రూమర్స్ వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











