నారప్ప విడుదలపై కొత్త కన్ఫ్యూజన్.. మరోసారి వాయిదా?
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ నారప్ప సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. వెంకటేష్ రీమేక్ సినిమాలలో సోల్ మిస్సవ్వకుండా తనదైన శైలిలో ప్రజెంట్ చేస్తాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక తమిళ్ లో ధనుష్ చేసిన అసురన్ సినిమాను తెలుగులో నారప్పగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై కూడా ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు భారీగానే ఉన్నాయి.
శాకుంతలగా సమంత అక్కినేని.. గుణశేఖర్ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభం (ఫొటోలు)
సినిమా తప్పకుండా భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందని నిర్మాత సురేష్ బాబు విడుదల విషయంపై చాలా తెలివిగా అడుగులు వేస్తున్నారు. ఈ సినిమాను మే 14న విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అఫీషియల్ గా పోస్టర్స్ తో ప్రమోషన్ గట్టిగానే చేస్తున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ రిలీజ్ డేట్ పై కొన్ని రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. మే 13న ఆచార్య రాబోతున్న విషయం తెలిసిందే.

బాక్సాఫీస్ వద్ద ఒకేసారి రెండు పెద్ద సినిమాలు పోటీకి దిగడం కరెక్ట్ కాదని సురేష్ బాబు తన ఆలోచనను మార్చుకుంటున్నట్లు టాక్ వస్తోంది. మే 28కి సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు ఒక న్యూస్ అయితే వైరల్ అవుతోంది. లేకపోతే కాస్త ముందుగా ఏప్రిల్ 30ని ఫిక్స్ చేయాలని ఆలోచిస్తున్నారట. మరి ఈ గాసిప్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే చిత్ర యూనిట్ నుంచి మరో పోస్టర్ రిలీజ్ అయ్యే వరకు వేయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











