Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
హిట్ సీక్వెల్ మరో హీరో చేతుల్లోకి.. విశ్వక్ మిస్ చేసుకున్నాడా?
విజయ్ దేవరకొండ తరువాత ఆ రేంజ్ లో కాకపోయినా దాదాపు అదే స్టైల్ లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు యువ హీరో విశ్వక్ సేన్. అచ్చమైన హైదరాబాదీగా ఆడియెన్స్ కి ఎంతగానో దగ్గరైన ఈ యంగ్ టాలెంటెడ్ హీరో అప్పుడప్పుడు బోల్డ్ కామెంట్స్ తో వైరల్ అవుతున్నాడు. కేవలం లవ్ స్టొరీ మాస్ మసాలా సినిమాలనే కాకుండా విభిన్నమైన ఇన్వెస్టిగేషన్ బ్యాక్ డ్రాప్ లో కూడా సినిమాలను చేస్తున్నాడు. నాని ప్రొడక్షన్ లో వచ్చిన 'హిట్' సినిమాలో విశ్వక్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.
సినిమా హిట్ అవ్వడంతో మొదట్లోనే సీక్వెల్ పై అనేక రకాల రూమర్స్ వచ్చాయి. నాని చేయబోతున్నట్లు కథనాలు కూడా వైరల్ అయ్యాయి. కానీ విశ్వక్ సేన్ ను దృష్టిలో ఉంచుకొని దర్శకుడు శైలేశ్ ఇంట్రెస్టింగ్ కథను రెడీ చేశాడని హీరో విషయంలో మార్పులు చేయడం లేదని టాక్ వస్తున్న సమయంలో.. ఇప్పుడు మళ్లీ హీరోను చేంజ్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఇక హిట్ సీక్వెల్ లో నటించబోయేది అడవి శేష్ అని దాదాపు స్క్రిప్ట్ మొత్తం సిద్ధమైందని అంటున్నారు. ఇక త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళుతుందని కూడా ఒక టాక్ అయితే వస్తోంది.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చర్చలు అయితే గట్టిగానే జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇక మరోవైపు అడివి శేష్ ప్రస్తుతం మేజర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక క్షణం, గూఢచారి, ఎవరు వంటి వినూత్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న శేష్ హిట్ సీక్వెల్ కి సరిగ్గా సెట్టవుతాడాని పైగా సినిమా రేంజ్ కూడా పెరగవచ్చని నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారట. మరి సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి.