RRRలో అలాంటి సన్నివేశాలకు ఛాన్స్ లేదు.. నమ్ముకొని సినిమాకి వెళితే ఇక అంతే..

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో RRR మొదటి స్థానంలో ఉంది. రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ ఫ్రీడమ్ ఫైటర్స్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆల్ మోస్ట్ పూర్తయ్యింది. ఇక రాజమౌళి సినిమాలు అంటే అన్ని వర్గాల ప్రేక్షకులు ఇష్టపడే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయని అనుకోవడం సహజం. అయితే ఓ వర్గం వారికి నచ్చే సన్నివేషాలు ఈ సినిమాలో ఉండవని తెలుస్తోంది.

Recommended Video

RRR Movie Streaming Details, బిజినెస్ 1200 కోట్ల పైనే || Filmibeat Telugu
 సినిమా స్టార్ట్ అవ్వగానే

సినిమా స్టార్ట్ అవ్వగానే

రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్ కలిసి పోరాటానికి సిద్ధమైతే ఎలా ఉంటుందనే ఫిక్షనల్ కథతోనే సినిమాను రూపొందిస్తున్నారు. ఇంట్రడక్షన్ సీన్స్ తోనే రాజమౌళి గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సీన్స్ ను సెట్ చేశారట.

ఆడియెన్స్ మనసును టచ్ చేసేలా..

ఆడియెన్స్ మనసును టచ్ చేసేలా..

సినిమా పూర్తిగా ఫ్రీడమ్ ఫైట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది కాబట్టి ఎక్కువగా సీరియస్ ఎమోషన్స్ హైలెట్ అవుతాయట. సాధారణంగా జక్కన్న సినిమాల్లో యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక అలాంటి సినిమాలకు ఆయన మిక్స్ చేసే ఎమోషనల్ సీన్స్ ఆడియెన్స్ మనసును టచ్ చేసేలా ఉంటాయి.

అలాంటి సీన్స్ ఉండవట

అలాంటి సీన్స్ ఉండవట

ఇక బాహుబలి లాంటి సినిమాలో కూడా మొదట్లో కాస్త ఎంటర్టైన్మెంట్ టచ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే RRR లో మాత్రం అంతగా ఉండవని తెలుస్తోంది. దేశం కోసం పోరాడే సినిమా కాబట్టి అసలు సినిమాలో కామెడీ ట్రాక్స్ కు తావుండదు. సినిమా చూస్తున్నంత సేపు కూడా రోమాలు నిక్కబొడిచేలానే ఉంటాయని తెలుస్తోంది.

వాళ్ళ కోసమే జక్కన్న స్పెషల్ ప్లాన్

వాళ్ళ కోసమే జక్కన్న స్పెషల్ ప్లాన్

అయితే ఇలాంటి సినిమాలో కూడా ఎంతోకొంత సరదా సన్నివేశాలు ఉంటాయని ఊహించుకొని వచ్చే నార్మల్ ఆడియెన్స్ కూడా ఉంటారు. వారి మైండ్ సెట్ ను కూడా ముందే సెట్ చేసి సినిమాకు వచ్చేలా జక్కన్న ప్రమోషన్ ప్లాన్స్ వేయనున్నట్లు తెలుస్తోంది. మరిన్ని మేకింగ్ వీడియోలతో పాటు స్పెషల్ గా ప్రోమోలను కూడా రెడీ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X