'ఉప్పెన'లా పెరిగిన వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్.. అడగకపోయినా ఆఫర్స్ ఇచ్చేస్తున్నారు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు ఏడాది అనంతరం అసలైన బాక్సాఫీస్ స్టామినా ఏమిటో ఉప్పెన సినిమా చూపించింది. అంతే కాకుండా కమర్షియల్ మాస్ సినిమాలు అందుకునే రికార్డును ఒక ఎమోషనల్ లవ్ స్టొరీ అందుకోవడం విశేషం. గతంలో ఎన్నో ప్రేమ కథలు హిట్టయ్యాయి. కానీ ఈ రేంజ్ లో ఓపెనింగ్స్ అందుకోలేదు. ఈ ఒక్క సినిమాతో సినిమాకు పని చేసిన వారి భవిష్యత్తు కూడా మారిపోయింది. ముఖ్యంగా వైష్ణవ్ రెమ్యునరేషన్ ఇప్పుడు ఒక రేంజ్ లో పెరిగిందనే రూమర్స్ గట్టిగానే వస్తున్నాయి.

 సుకుమార్ 90కోట్ల నమ్మకం

సుకుమార్ 90కోట్ల నమ్మకం

హడావుడి ఎండ్ అయ్యే లోపు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను అందుకోగలదని ఒక నమ్మకం వచ్చేసింది. ఇక సహా నిర్మాతగా ఉన్న సుకుమార్ ఇటీవల సినిమా 100కోట్లు కలెక్ట్ చేయకపోయినా దాదాపు 90కోట్ల వరకు రావచ్చని అంచనా వేశారు. అయితే ఆయన అంచనాలకు తగ్గట్లుగా సినిమా వసూళ్లు అందుకుంటుందా లేదా అనేది కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది.

ఇప్పటికే 58కోట్ల గ్రాస్

ఇప్పటికే 58కోట్ల గ్రాస్

సినిమా విడుదలై బుధవారానికి ఆరు రోజలయ్యింది. ఇక సినిమా ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 58కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక 36.73కోట్ల షేర్స్ వచ్చినట్లు సమాచారం. సినిమా ఈ రేంజ్ లో వసూళ్లు అందుకోవడానికి కారణం మ్యూజిక్, స్టోరీ అయినప్పటికీ హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా కావడం కూడా మరో కారణం.

ఉప్పెన రెమ్యునరేషన్ ఎంత?

ఉప్పెన రెమ్యునరేషన్ ఎంత?

వైష్ణవ్ తేజ్ తన నటనతో అద్భుతంగా ఆకట్టుకున్నాడు. అందుకే ఉప్పెన విడుదలకు ముందే క్రిష్ లాంటి క్రియేటివ్ డైరెక్టర్ చేతిలో పడ్డాడు. ఆయన దర్శకత్వంలో ఒక సినిమాను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇక ఉప్పెన సినిమాకు వైష్ణవ్ తేజ్ పెద్దగా రెమ్యునరేషన్ ఏమి అందుకోలేదట. 80లక్షల వరకు ఇచ్చినట్లు ఒక టాక్ అయితే వస్తోంది. ఇప్పుడు సినిమా 15కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది కాబట్టి మళ్ళీ షేర్ ఏమైనా ఇస్తారేమో చూడాలి.

బడ్జెట్ విషయంలో తగ్గలేదు..

బడ్జెట్ విషయంలో తగ్గలేదు..

రెమ్యునరేషన్ తక్కువ ఇచ్చినప్పటికీ సినిమా మేకింగ్ దగ్గర మాత్రం నిర్మాతలు బార్డర్స్ ఏమి పెట్టలేదు. దర్శకుడి విజన్ కు తగ్గట్లుగానే ఖర్చు చేశారు. సినిమాను మొదట 10 కోట్ల బడ్జెట్ లోపే ఫినిష్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ లెక్కలు 17కోట్ల వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. హీరో, దర్శకుడి మీద నమ్మకం వల్ల సుకుమార్ సపోర్ట్ తో నిర్మాతలు ధైర్యం చేశారు. పూర్తిగా కొత్త వాళ్ళతో ఈ స్థాయిలో సినిమాను నిర్మించడం అంటే చాలా రిస్క్ తో కూడుకున్న పని. కానీ మైత్రి మూవీ మేకర్స్ సినిమా మీద నమ్మకంతో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు.

వైష్ణవ్ కు భారీ ఆఫర్స్

వైష్ణవ్ కు భారీ ఆఫర్స్

ఉప్పెన వల్ల వైష్ణవ్ తేజ్ కెరీర్ కు ఒక మంచి బూస్ట్ లభించింది. ఈ సినిమాతో అతని మార్కెట్ డిసైడ్ చేయలేము గాని అతని తదుపరి సినిమాలకు మాత్రం 5 నుంచి 6కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. వైష్ణవ్ ఇప్పుడే పెద్దగా డిమాండ్ ఏమి చేయడం లేదట. కానీ అతని డేట్స్ కోసం నిర్మాతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X