Pushpa 2 : "పుష్ప 2" కి భారీగా టికెట్ ధరలు? .. సింగిల్ టికెట్ ధర ఎంతంటే?
ఇప్పుడు పాన్ ఇండియా లెవల్‌లో మోస్ట్ హైప్ ఉన్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా సెన్సేషనల్ ప్రాజెక్ట్ పుష్ప పార్ట్ 2 ది రూల్ అని చెప్పి తీరాలి. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ ల కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఇపుడు రిలీజ్‌కి దగ్గరై ఎనలేని హైప్ ని పాన్ ఇండియా వైడ్ గా చూపించింది.
మొన్నటికి మొన్న ట్రైలర్ లాంచ్ ని పాట్నాలో నిర్వహిస్తే లక్షలాది మంది నార్త్ జనం వచ్చి ఈవెంట్ ని బిగ్గెస్ట్ సక్సెస్ చేశారు. దీనితో అసలు పుష్ప 2 ఇండియా వైడ్ గా ఏ రేంజ్ హైప్ ఉంది అనేది క్లియర్ గా అర్ధం అయ్యింది. అయితే మన దగ్గర పలు హైప్ ఉన్న సినిమాలకి, స్టార్ హీరోల సినిమాలకి టికెట్ ధరలు హైక్ ఇవ్వడం అనేది ఎప్పుడూ జరుగుతూనే వస్తుంది అని తెలిసిందే.

కాగా ఈ ట్రెండ్ బాహుబలి 1 నుంచి తెలుగు స్టేట్స్ నుంచే మొదలు కాగా అక్కడి నుంచి నేటి వరకు ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ ప్రభుత్వం ఉన్నా పలు సినిమాలకి హైక్ లు ఇచ్చి కొన్ని రోజులు పాటు అలా ఉంచుతారు అనేది అందరికీ తెలిసిందే. కాగా ఏపీలో మాత్రం ఆ మధ్య టికెట్ ధరలు బెనిఫిట్ షోస్ విషయంలో జరిగిన రచ్చ ఏంటి అనేది కూడా అందరికీ తెలిసిందే.
అయితే మధ్యలో తగ్గించిన ధరల విషయంలో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఇక్కడ మాత్రం మరీ తక్కువ ధరలు పెట్టడంతో నిర్మాతలకి కూడా భారీ నష్టాలు వచ్చాయి. అయితే గత ఏపీ ప్రభుత్వం సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండాలి అని ధరలు మార్చడం బాగానే ఉంది. కానీ అందులో కొంతమేర పర్సనల్ కారణాలు కూడా ఉన్నాయని పలు రూమర్స్ ఉన్నాయి.
ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు రావడం జరిగింది. దీంతో మళ్ళీ గతంలో మాదిరిగా భారీ హైక్ లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. మొన్న కల్కి 2898 ఎడి, తర్వాత ఎన్టీఆర్ దేవర సినిమాలకి భారీ ధరలతో పాటు బెనిఫిట్ షోస్ కూడా వేసుకున్నారు. అయితే ఈ అన్నిటికి మించి రికార్డు ధరలు పుష్ప 2 సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయని సినీ వర్గాల్లో ఇపుడు నుంచే వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి తెలుగు రాష్ట్రాల్లో ఒక్క సింగిల్ టికెట్ ధరే అక్షరాలా రూ.700 కి పైగా ఉండొచ్చు అని షాకింగ్ టాక్ వినిపిస్తుంది. ఒక్క టికెట్ కి 700 అది కూడా ఎలాంటి బ్లాక్ కాకుండా అంటే అది మామూలు విషయం కాదని చెప్పాలి. కాగా సింగిల్ స్క్రీన్ లో ఒక్క టికెట్ ధరే 300 కి పెంచాలని చూస్తున్నారట. ఇది మాత్రం భారీ మొత్తమే అని చెప్పాలి. అయితే దీనికి కారణాలు ఏంటంటే పుష్ప 2 ని తెలుగు స్టేట్స్ లో 3డి లో కూడా రిలీజ్ చేస్తున్నారు.

సాధారణంగా మల్టిప్లెక్స్ లలో సాధారణ ధరే 300 నుంచి 350 ఉంటుంది. ఇక దానికి అదనంగా ఇచ్చే హైక్ లు వాటికి తోడు మళ్ళీ 3డి గ్లాసెస్ ఛార్జ్ లు కలిపి ఈజీగా 700 ఉంటుందట. ఇక 2డి వెర్షన్ లో కూడా మల్టీప్లెక్స్ లలో అయితే 600కి పైగా అలాగే సింగిల్ స్క్రీన్ లో 2డి రూ. 325, 3డి వెర్షన్ లోరూ. 375 ఉంటాయని వినిపిస్తుంది. మరి ఈ రేంజ్ లో రేట్లు అంటే కొన్ని రోజులు పాటు సామాన్యుడు థియేటర్ దగ్గరకి కూడా వెళ్లకపోవచ్చని చెప్పాలి.
మొదటి మూడు రోజులూ ఎలా ఉన్నా ఆ ఊపులో ఫ్యాన్స్ చూసేస్తారు . కానీ జనరల్ ఆడియెన్స్ ని రప్పించాలి అంటే డెఫినెట్ గా ఇంత భారీ రేట్లు అంటే సామాన్య జనం ఏమో కానీ అల్లు అర్జున్ అభిమానుల్లోనే ఉండే మిడిల్ క్లాస్ యువకులే వెళ్తారో లేదో అనేది ప్రశ్నార్థకం. ఇప్పటికే ఈ రేట్లు విని అంతా షాకవుతున్నారు. ఈ టికెట్ ధరలు కనుక అమల్లోకి వస్తే డే 1 భారీ రికార్డులు నమోదు అవ్వడం ఏమో కానీ సామాన్యుడికి థియేటర్స్ లో సినిమాని మరింత దూరం చేస్తున్నట్టే అనుకోవాలి.


Click it and Unblock the Notifications











