అల్లు అర్జున్, త్రివిక్రమ్ అలా డిసైడ్ అయ్యారా..? బన్నీ అభిమానులకు హార్ట్ బ్రేకింగ్ న్యూస్

Recommended Video

Ala Vaikutapuramlo Teaser Update || అల.. వైకుంఠపురములో టీజర్ ఎప్పుడంటే..? ||

అల్లు అర్జున్ గత సినిమా 'నా పేరు సూర్య' డిసాస్టర్ కావడంతో ఆయన అభిమానులు నిరాశ చెందారు. అయితే ఆ సినిమా తర్వాత కథల ఎంపికలో చాలా జాగ్రత్త తీసుకున్న బన్నీ ఎట్టకేలకు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కొత్త సినిమాకు కమిట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ విషయం బన్నీ అభిమానులను కలవరపెడుతోంది. ఇంతకీ ఏంటా విషయం..? వివరాల్లోకి పోతే..

ఇటీవలే బన్నీ అభిమానులకు సూపర్ ట్రీట్

ఇటీవలే బన్నీ అభిమానులకు సూపర్ ట్రీట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త సినిమా ‘అల.. వైకుంఠపురములో'. అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఇద్దరు కూడా ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ద తీసుకొని రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి నింపారు. ఈ లుక్‌లో అల్లు అర్జున్ యమ స్టైలిష్‌గా కనిపించడం బన్నీ అభిమానులకు సూపర్ ట్రీట్ ఇచ్చింది.

బన్నీ అభిమానులను ఆనందపరిచే మరో వార్త

బన్నీ అభిమానులను ఆనందపరిచే మరో వార్త

ఇదిలా ఉండగానే బన్నీ అభిమానులను ఆనందపరిచే మరో వార్త బయటకొచ్చింది. అదే.. ఈ సినిమా టీజర్ గురించి. ‘అల.. వైకుంఠపురములో' టీజర్ నవంబర్ 7న విడుదల చేయాలని ముందుగా భావించిన చిత్రయూనిట్.. దాన్ని ఇంకో నెల ముందుకు జరిపి ఈ దసరా కానుకగా రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారని చెప్పుకున్నారు. ఈ మేరకు అక్టోబర్ 8వ తేదీని టీజర్ విడుదల తేదీగా ఫిక్స్ చేశారని టాక్ నడిచింది

సైరా నరసింహారెడ్డి రూపంలో మరో ట్రీట్

సైరా నరసింహారెడ్డి రూపంలో మరో ట్రీట్

ఇక ‘అల.. వైకుంఠపురములో' టీజర్‌ని విడుదల చేసి మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక సినిమా సైరా నరసింహారెడ్డి ప్రదర్శించబడే అన్ని థియేటర్స్ లో ప్రదర్శించాలనే ప్లాన్ చేశారని కూడా టాక్ నడించింది. దీంతో బన్నీ అభిమానులతో పాటు మెగా అభిమానులంతా ఖుషీ అయ్యారు. సైరా టికెట్‌తోనే వెండితెరపై బన్నీ స్టైల్ కూడా చుసేయొచ్చని ఆశ పడ్డారు.

ఇంతలో వీళ్ళ ఆశలు ఆవిరయ్యేలా

ఇంతలో వీళ్ళ ఆశలు ఆవిరయ్యేలా

కానీ వీళ్లందరి ఆశలు ఆవిరయ్యేలా ఓ హార్ట్ బ్రేకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం 'అల...వైకుంఠపురములో' టీజర్ దసరా వరకు సిద్ధమయ్యే అవకాశం కనిపించడం లేదనేది తాజా సమాచారం. ఇప్పటివరకు టీజర్ కటింగ్‌కి సంబందించిన ఏ ఒక్క పని మొదలు కాలేదట. పరిస్థితి చూస్తే దసరా కల్లా ఆ పనులు పూర్తయ్యేలా కనిపించడం లేదట.

ఆలస్యంగా షూటింగ్.. సంక్రాంతికి వచ్చేనా..?

ఆలస్యంగా షూటింగ్.. సంక్రాంతికి వచ్చేనా..?

మరోవైపు వైపు సినిమా షూటింగ్ కూడా ఆలస్యంగా సాగుతోందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు దాదాపుగా 50 శాతం షూటింగ్ మాత్రమే పూర్తయింది కాబట్టి సంక్రాంతికి ఈ సినిమా విడుదల కావడం కష్టమే అనే టాక్ వినిపిస్తోంది. దీంతో చాలా కాలంగా బన్నీని వెండితెరపై చూడాలని కుతూహలంగా ఉన్న ఆయన అభిమానులు మరింత నిరాశ చెందుతున్నారు.

అల..వైకుంఠపురములో మూవీ

అల..వైకుంఠపురములో మూవీ

గీతా ఆర్ట్స్ బ్యానర్‌, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో 'అల..వైకుంఠపురములో' సినిమా తెరకెక్కుతోంది. చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X