ఐటం గర్ల్ గా మారిన శ్రద్దాదాస్

By Srikanya

హైదరాబాద్ : హీరోయిన్ గా లేదా మెయిన్ లీడ్ నటి గా చేయటంలో విఫలమైన శ్రద్దా దాస్ ఐటం గర్ల్ గా కనిపించి అలరించటానికి సిద్దమవుతోంది. అదీ కూడా ఓ కామెడీ చిత్రంలో. ఆ చిత్రం మరేదో కాదు అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న బంది పోటు సినిమాలో ఆమె ఐటం సాంగ్ చేస్తోంది. ఈ మేరకు ఆమె మీద రీసెంట్ గా హైదరాబాద్ లో షూట్ చేసారు. ఆమె ఐటం సాంగ్ చిత్రం హైలెట్స్ లో ఒకటని అంటున్నారు.

అల్లరి నరేష్, ఇషా జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఇ.వి.వి. సినిమా పతాకంపై ఆర్యన్ రాజేష్ రూపొందిస్తున్న చిత్రం ‘బందిపోటు' . ‘బందిపోటు' సినిమా ‘రాబిన్ హుడ్' తరహాలో ఉంటుంది. దొంగల్ని దోచుకో అనే కాన్సెప్ట్ తో ఉంటుంది. ఇంద్రగంటి గారు చెప్పగానే బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించి ఈ సినిమాకి ఓకే చెప్పాను. మాములుగా అయన సినిమాలంటే ఎ సెంటర్స్ కే పరిమితం అంటారు, కానీ కామెడీ మూవీ మాత్రం ఎ,బి,సి సెంటర్స్ అందరూ చూడదగిన సినిమా అంటున్నారు నరేష్.

ఇ.వి.వి. సంస్థలో పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని, ఏ సినిమాకు ఈ చిత్రం వ్యంగాత్మక రూపకం కాదని, కేవలం అందరిని కామెడీతో అలరించాలన్న కోరికతో చేస్తున్న చిత్రమని చిత్ర దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెలిపారు.

Shradda das turns as item girl

దొంగల్ని దోచుకునే బందిపోటు కథను ఎంతో వినోదంగా రూపొందిస్తున్నామని, ఓ మంచి కథ దొరకడంతో మోహన్‌కృష్ణతో ఈ చిత్రం చేస్తున్నామని, ప్రయోగాత్మక చిత్రం మాత్రం కాదని, నవ్వించడమే ప్రత్యేక ప్రయోగమని అల్లరి నరేష్ తెలిపారు.

తన తండ్రి పేరును పెంచేలా ఈ సంస్థలో చిత్రాలను నిర్మిస్తామని, తామనుకున్న స్థాయిలో కథ దొరకడంతో ఈ సినిమా ప్రారంభించామని నిర్మాత రాజేష్ తెలిపారు.

పోసాని కృష్ణమురళి, చంద్రమోహన్, తనికెళ్ల భరణి, రావూ రమేష్, రఘుబాబు, శ్రీనివాస్ అవసరాల, పృధ్వీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కళ్యాణ్ కోడూరు, కెమెరా: పి.జి.విందా, ఎడిటింగ్:శ్రవణ్, నిర్మాత: ఆర్యన్ రాజేష్, దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X