గ్రేట్ డైరెక్టర్ తో హమ్మింగ్ చేసిన శ్రద్ధా కి దాంట్లో కూడా టాలెంట్ ఉందంటా?
హీరోయిన్ శ్రద్ధాదాస్ కి సింగింగ్ టాలెంట్ కూడా వుందిట. ఈ విషయాన్ని ఆమె చాన్నాళ్ళుగా చెబుతూ వస్తున్నా, ఇప్పటిదాకా సింగర్ గా ఆమెకి ఛాన్సెవ్వరూ ఇవ్వలేదు. జర్నలిజం కూడా చేసేశానని చెప్పుకుంటోన్న శ్రద్దాదాస్ ప్రస్తుతం 'ఆర్య 2" చిత్రంపై బోల్డన్ని ఆశలు పెట్టుకుంది.
త్వరలోనే విడుదలకు సిద్దమవుతోన్న 'ఆర్య 2" చిత్రం ఆడియో ఇటీవలే విడుదలైన సంగతి తెల్సిందే. ఈ కార్యక్రమంలో శ్రద్దాదాస్ తన సింగింగ్ టాలెంట్ ని బయటపెట్టింది. మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీప్రసాద్ తో కలిసి హమ్మింగ్ చేసిన శ్రధ్దాదాస్, చాలా హడావిడే చేసింది. అల్లు అర్జున్ సపోర్ట్ తో 'ఆర్య 2"లో ఛాన్స్ కొట్టేసిన శ్రధ్ధాదాస్, ఈ చిత్రంతో హీరోయిన్ గా సక్సెస్ ట్రాక్ ఎక్కుతాననే ధీమా వ్యక్తం చేస్తోంది.
శ్రద్దాదాస్ ఆర్య 2 అల్లు అర్జున్ దేవిశ్రీప్రసాద్ కాజల్ నవదీప్ shraddha das allu arjun arya 2 devisri prasad kajal navdeep


Click it and Unblock the Notifications