వేశ్యగా చేసేందుకు శ్రద్ధా దాస్ రెడీ! స్టార్ స్టేటస్ పట్టాలనే టార్గెట్‌తో..
ప్రస్తుత రోజుల్లో హీరోయిన్‌గా నిలదొక్కుకోవాలంటే ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదృష్టంతో పాటు అవకాశాలు కలిసొస్తే గానీ హీరోయిన్‌గా స్టార్ స్టేటస్ పట్టేయడం కష్టం. ఈ ప్రయాణంలో ఎన్నోరకాల క్యారెక్టర్స్ వేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ శ్రద్ధా దాస్ ఓ బోల్డ్ క్యారెక్టర్ చేసేందుకు రెడీ అయిందట. వివరాల్లోకి పోతే..

అందాల ఆరబోతలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు
టాలీవుడ్ ప్రేక్షకులకు వెండితెర విందు ఇస్తూ అందాల ఆరబోతలో తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకుంది శ్రద్ద దాస్. దీంతో ఈ ముంబై భామకు మంచి క్రేజ్ ఏర్పడింది. 'సిద్దు ఫ్రం శ్రీకాకుళం' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత అందాల భామగా క్రేజ్ కొట్టేసింది.

మెల్లగా అవకాశాలు తగ్గడంతో..
కేవలం తెలుగులోనే గాక హిందీ, మలయాళీ, బెంగాలీ, కన్నడ భాషల్లోని ప్రేక్షకులకు స్పెషల్ కిక్ ఇచ్చింది శ్రద్ద దాస్. దీంతో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత మెల్లగా అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియా ద్వారా అందాల వడ్డిస్తూ ఫాలోయింగ్ చెక్కుచెదరకుండా జాగ్రత్త పడింది శ్రద్ద.

ఇక లాభం లేదని బోల్డ్ రూట్..
అదే విధంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'ఆర్య 2'లో అదరగొట్టి కుర్రకారు హృదయాలను దోచేసిన ఈ భామ.. ''డార్లింగ్, గుంటూరు టాకీస్, గరుడవేగ'' లాంటి సినిమాల్లోనూ తన అందాలకు పదునుపెట్టింది. అయినప్పటికీ ఇంతవరకు సరైన బ్రేక్ రాకపోవడంతో ఇక లాభం లేదని ఓ బోల్డ్ పాత్ర చేసేందుకు సిద్దమైందట శ్రద్ద దాస్.

మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఇలా..
కొరియోగ్రఫర్ విద్యాసాగర్ దర్శకుడిగా మారి ఓ చిత్రాన్ని తెరకేక్కిన్చాబోతున్నారు. సీనియరో హీరో జగపతిబాబు ప్రధాన పాత్ర పోషించనున్న ఈ సినిమాలో శ్రద్ధా దాస్ వేశ్య పాత్రలో అలరించనుందని సమాచారం. వెండితెరపై మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఈ ప్రయత్నం చేస్తోందట ఈ ముంబై బ్యూటీ. ఈ పాత్ర సినిమాకు చాలా ప్రధానమైనదని, బలమైన భావోద్వేగాలతో పాటు నటనకు ఆస్కారముందని తెలుస్తోంది.

జగపతిబాబు వ్యాపారవేత్త.. శ్రద్ద దాస్ ఛాలెంజింగ్ రోల్
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని సమాచారం. చిత్రంలో జగపతిబాబు ఓ వ్యాపారవేత్తగా నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ పాత్ర నటిగా తనకు ఛాలెంజింగ్ పాత్ర అని భావిస్తోందట శ్రద్ద దాస్. ఈ సినిమాలో కొన్ని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయని, అవి సినిమాకు చాలా కీలకమైనవనిగా ఉంటాయని అంటున్నారు.


Click it and Unblock the Notifications











