ఆ హీరోయిన్ ఆ పార్ట్‌కి సర్జరీ చేయించిందా? 38 ఏళ్ల వయసులో ఆ లుక్ వెనుక?
ఇటీవలి కాలంలో చిన్నా, పెద్దా అందరికీ అందంపై అందరికీ స్పృహ పెరిగింది. ఫేస్ ప్యాక్‌లు, మాయిశ్చరైజింగ్ క్రీములు, జ్యూస్‌లు ఇలా అన్నిరకాలుగా శరీరాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నగరాలు, పట్టణాలే కాకుండా మారుమూల పల్లెల్లోనూ బ్యూటీ పార్లర్‌లు వెలుస్తున్నాయంటే పరిస్ధితిని అర్ధం చేసుకోవచ్చు. వీటికి అదనంగా వర్కవుట్లు, యోగా, జిమ్‌లు వంటి కల్చర్ పెరుగుతోంది. శరీరంలో ఏదైనా అవయవం తేడాగా ఉన్నా.. లోపాలున్నా వెంటనే కాస్మోటిక్ సర్జరీల బాట పడుతున్నారు.
హాట్ టాపిక్‌గా కాస్మోటిక్ సర్జరీలు
సామాన్యుల పరిస్ధితే ఇలా ఉంటే గ్లామర్ ప్రపంచానికి రారాజులుగా బతికే సినీతారల పరిస్ధితి ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందం, ఫిట్‌నెస్ ఉన్నంత కాలమే వారి జీవితం.. మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా ఉంటుంది. ఇందుకోసం కఠినమైన డైట్లు, జీరో సైజ్‌లు, రకరకాల సౌందర్య సాధనాలు వాడుతుంటారు. కొవ్వు కరిగించుకునేందుకు ఆపరేషన్ల వరకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన నటీనటులు కూడా ఉన్నారు. అయినప్పటికీ పరిస్ధితిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. తారల కాస్మోటిక్స్ సర్జరీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఓ సినీ కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఆ నటి ఎవరు? ఎందుకు? ఏ పార్ట్‌లో సర్జరీ చేయించుకుందో చూస్తే.

టాలీవుడ్‌కి పాకిన సర్జరీల కల్చర్
గతంలో బాలీవుడ్‌కే పరిమితమై కాస్మోటిక్, ప్లాస్టిక్ సర్జరీ ట్రెండ్ ప్రస్తుతం దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలకు విస్తరించింది. ముక్కు, కళ్లు, పెదవులు, బుగ్గలు, నుదురు, ఛాతీ ఇలా ఏ భాగం కావాలంటే.. ఆ పార్ట్‌కు చకచకా సర్జరీలు చేసేస్తున్నారు. దివంగత దిగ్గజ నటి, అతిలోక సుందరి శ్రీదేవి తన శరీరానికి 29 సర్జరీలు చేయించుకున్నారని బాలీవుడ్‌లో ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. సినీతారలు ఈ ఆపరేషన్స్ చేయించుకున్నప్పుడు సక్సెస్‌లే కాదు.. ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి.
శ్రీదేవి టూ నయనతార అంతా అదే బ్యాచ్
శ్రీదేవి మాత్రమే కాదు.. దక్షిణాది అగ్రనటి సమంత తన ముక్కు, పెదాలకు సర్జరీ చేయించుకున్నారు. మరో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ .. తన అందాన్ని మరింత మెరుగ్గా ఉంచుకునేందుకు, ముఖంలోని లోపాలను సరిచేసుకునేందుకు తన ముక్కుకు అమెరికాలో సర్జరీ చేయించుకున్నారు. లేడీ సూపర్‌స్టార్ నయనతార తన శరీరంలోని కొవ్వుని కరిగించుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని స్లిమ్‌గా మారారు. స్టార్ హీరోయిన్లే ఇలా దూసుకెళ్తుంటే మనమెంత అనుకున్నారేమో కానీ కుర్ర హీరోయిన్లు, స్టార్ స్టేటస్ కోసం ప్రయత్నిస్తున్న వారు ఎందరో. తాజాగా సీనియర్ హీరోయిన్ శ్రద్దా దాస్ కూడా సర్జరీ చేయించుకున్నట్లుగా గాసిప్స్ వస్తున్నాయి.
స్టార్‌డమ్ కోసం శ్రద్ధా దాస్ కష్టాలు
ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 18 ఏళ్లు కావొస్తున్నా శ్రద్ధా దాస్ కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. ఆమె కంటే వెనుక వచ్చిన హీరోయిన్లు స్టార్లుగా దూసుకెళ్తుంటే శ్రద్ధ మాత్రం ఇంకా స్టార్‌డమ్ కోసం శ్రమిస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులో అర్ధం అనే చిత్రంలో శ్రద్ధ నటిస్తున్నారు. అందం, అభినయం పరంగా తిరుగు లేనప్పటికీ ఈమెకు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కుర్రాళ్లను రెచ్చగొట్టే శ్రద్ధా దాస్.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు సంచలనం సృష్టిస్తున్నాయి.
శ్రద్ధా దాస్ ముఖంలో మార్పులు
చుక్కల చీరలో నాభి, నడుము, ఎద అందాలు కనిపించేలా గ్లామర్ షో చేసిన శ్రద్ధాదాస్ ముఖంలో తేడా కనిపిస్తోందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ మేరకు గత ఫోటోలు, ప్రస్తుత ఫోటోలను జాగ్రత్తగా పరిశీలించి తేడాలను రౌండప్ చేస్తున్నారు. పెదవుల్లో, ముఖం, గడ్డం దగ్గర మార్పులు వచ్చినట్లుగా చెబుతున్నారు. చాలా మంది శ్రద్ధాదాస్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ఉండొచ్చని అభిప్రాయపడుతుండగా.. మరికొందరు మాత్రం ఆమె 40కి దగ్గరపడింది కాబట్టి వయసుపరమైన మార్పులుగా అభివర్ణిస్తున్నారు. మరి శ్రద్ధా దాస్ నిజంగానే సర్జరీ చేయించుకున్నారా? లేక ఇది గాలివార్తో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











