NTR30: ఎన్టీఆర్‌ సినిమా నుంచి మరో బ్యూటీ ఔట్.. ఆలియానే కాదు.. ఈమెకూ అదే సమస్య

నందమూరి తారక రామారావు మనవడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే తనదైన టాలెంట్లను చూపించి ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను ఖాతాలో వేసుకున్న అతడు.. స్టార్‌డమ్‌ను అందుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా వరుస సినిమాలతో దూసుకుపోతోన్నాడు. మధ్యలో కొన్ని పరాజయాలతో సతమతం అయినప్పటికీ.. ఈ మధ్య కాలంలో వరుసగా 'టెంపర్', 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సూపర్ డూపర్ హిట్లను ఖాతాలో వేసుకుని ఫుల్ ఫామ్‌తో హవాను చూపిస్తున్నాడు.

హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్న జూనియర్ ఎన్టీఆర్.. ఇటీవలే RRR (రౌద్రం రణం రుధిరం) అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ మూవీ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అంతేకాదు, భారీ కలెక్షన్లను రాబట్టి ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఈ ఉత్సాహంతోనే యంగ్ టైగర్ తన తదుపరి చిత్రాన్ని బడా డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్నాడు. అయితే, ఈ సినిమా అనుకున్న సమయానికి ప్రారంభం కావడం లేదు. దీంతో ఈ సినిమా అసలు ఉంటుందా? లేదా? అన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.

Shraddha Kapoor Also Out From Jr NTR and Koratala Shiva Movie

'జనతా గ్యారేజ్' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ఈ ప్రాజెక్టుపై అప్పుడే ఆరంభంలోనే అంచనాలు నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా నుంచి ఎన్నో రకాల ఆసక్తికరమైన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. అదే సమయంలో ఈ సినిమా జూలై నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోబోతుందని కూడా ప్రచారం జరుగుతోంది. దీనికోసం నందమూరి అభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఇక, ఈ సినిమాకు సంబంధించిన కాస్టింగ్, టైటిల్, టెక్నీషియన్లకు సంబంధించిన ఎన్నో వార్తలు కూడా తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

క్రేజీ కాంబినేషన్‌లో పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు గతంలో క్లారిటీ వచ్చింది. కానీ, ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేని కారణంగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందని ఆ తర్వాత తెలిసింది. ఈ క్రమంలోనే ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన నటించేందుకు శ్రద్దా కపూర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఇటీవలే ఓ న్యూస్ లీకైంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఆమె కూడా ఈ ప్రాజెక్టులో చేయడం లేదని తెలుస్తోంది. ఆలియా లాగే ఈమె కూడా పలు చిత్రాలతో బిజీగా ఉండడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతుందట. ఈ కారణంగానే ఎన్టీఆర్ మూవీ నుంచి డ్రాప్ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివ కలయికలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోయే ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుందని అంటున్నారు. పల్లెటూరి నుంచి వచ్చిన యువకుడు దేశ రాజకీయాలను శాసించేలా ఎదగడమే దీని నేపథ్యం అని తెలుస్తోంది. ఇక, ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ అందించే అందించబోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X