రేట్ చెప్పి హడలెత్తిస్తున్న బాలీవుడ్ టాప్ బ్యూటీ.. రూపాయి తగ్గినా!

నార్త్ బ్యూటీస్ కోసం మన తెలుగు నిర్మాతలు పడే ఆరాటం ఇప్పుడిది కాదు ఎన్నో ఏళ్ళు నుంచి ఉన్నదే . కాగా మన తెలుగువారికి తక్కువే కానీ హిందీ నుంచి వచ్చే వారికి మాత్రం టాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుండగా బాలీవుడ్ హీరోయిన్స్ కొందరు వారంత వారే తెలుగులో వర్క్ చేసేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు.

ఇలా ప్రెజెంట్ హిందీ నుంచి హాట్ బ్యూటీస్ జాన్వీ కపూర్, దిశా పటాని ఇలా కొందరు తెలుగులో క్లిక్ అయ్యారు. వీరు కాకుండా తెలుగులో మరో హీరోయిన్ కి మంచి డిమాండ్ ఉంది. చేసింది ఒకే ఒక్క సినిమా, పైగా అది ప్లాప్ అయినప్పటికీ ఈమెని మాత్రం మన తెలుగు నిర్మాతలు ఇపుడు అఫర్డ్ చెయ్యలేకపోతున్నారట.

shraddha kapoor demanding solid remuneration in telugu

ఆ బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఎవరో కాదు యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ అట. తెలుగులో ఈమె పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో "సాహో" అనే సినిమా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ ఒక్క సినిమాతో శ్రద్ధా అందరికీ ఎంతో దగ్గరయింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ తెలుగులో ఆమె సినిమా చేసింది లేదు.

కానీ ఆమెకి ఆఫర్స్ రాలేదా అంటే వచ్చాయి, కానీ ఆమె చెప్పిన రేట్స్ కి నిర్మాతలు వెనుకడుగు వేశారు. దీంతో మళ్ళీ హిందీ ఇండస్ట్రీకే వెళ్ళిపోయిన శ్రద్దా అక్కడ ఏకంగా స్త్రీ 2 తో రూ.800 కోట్లకి వసూళ్లు దక్కించుకుని అదరగొట్టింది. స్త్రీ 2 బ్లాక్ బస్టర్ తర్వాత తన డిమాండ్ మరింత పెరిగిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ తెలుగులో ఆమెకి ఆఫర్లు స్టార్ట్ అయ్యాయి. కానీ ఇపుడు మరింత ఎక్కువ రెమ్యునరేషన్ చెబుతుండడంతో క్రేజీ ఆఫర్స్ ని ఈమె వదులుకోవాల్సి వస్తోంది.

shraddha kapoor demanding solid remuneration in telugu

ఈమె తెలుగులో ఆల్రెడీ "పుష్ప 2" స్పెషల్ సాంగ్ చేయాల్సి ఉంది. కానీ ఆమె చెప్పిన ఫిగర్ దెబ్బకి వెనకడుగు వేసిన మేకర్స్ శ్రీలీలతో సరిపెట్టుకున్నారు. ఈమె ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు అనుకోండి. ఇది వేరే విషయం. కానీ ఇది కాకుండా మరో బిగ్ ఆఫర్ ని శ్రద్ధా తెలుగులో వదులుకున్నట్టు తెలుస్తుంది. ఆ సినిమానే "పారడైజ్". దసరా కాంబినేషన్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ కి శ్రద్దా హీరోయిన్‌గా సెలక్ట్ అయినట్లుగా టాక్ వచ్చింది. కానీ ఈమె చెప్పిన రేటు విని నిర్మాతలు వెనక్కి వెళ్లారట.

దీనితో కేవలం రెమ్యునరేషన్ లతోనే ఈ బాలీవుడ్ టాప్ బ్యూటీ టాలీవుడ్ నిర్మాతలని హడలెత్తిస్తోంది అని సినీ వర్గాల్లో టాక్. శ్రద్దా కపూర్ ఫేమ్ తో నిర్మాతలు ఎలా క్యాష్ చేసుకోవాలని చూస్తారో ఆమె కూడా డిమాండ్ ఉన్నంతలోనే ఎక్కువ రాబట్టుకోవాలని చూస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఇక ప్రస్తుతం శ్రద్దా హిందీ సినిమాల్లోనే ఫుల్ బిజీగా ఉంది. మరి తెలుగులో మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందో చూడాలి మరి.

More from Filmibeat

Read more about: shraddha kapoor pushpa 2 war 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X