»   » ‘సాహో’లో శ్రద్దా కపూర్ ద్విపాత్రాభినయం? విచిత్రంగా ఉందే...

‘సాహో’లో శ్రద్దా కపూర్ ద్విపాత్రాభినయం? విచిత్రంగా ఉందే...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Shraddha Kapoor playing dual role in Saaho ?

హీరో ప్రధానంగా సాగే సినిమాల్లో హీరోలు మాత్రమే ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం లాంటివి చేస్తుంటారు. దర్శకులు, రచయితలు తమ కథలు కూడా ఆ కోణంలోనే రాసుకుంటారు. అయితే ప్రభాస్ 'సాహో'లో మాత్రం అందుకు భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది.

నమ్మశక్యంగా లేక పోయినా... 'సాహో' సినిమా విషయంలో ఓ రూమర్ తాజాగా ఇండస్ట్రీ సర్కిల్ లో హాట్ టాపిక్ అయింది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె డ్యూయెల్ రోల్‌లో కనిపించనుందని ప్రచారం మొదలైంది.

నిజమా?

నిజమా?

శ్రద్ధా కపూర్ ఈ చిత్రంలో రెండు పాత్రల్లో కనిపించడం నిజమేనా? కాదా? అనే విషయం పక్కన పెడితే.... ఒక పాత్రలో అచ్చమైన ప‌ద‌హార‌ణాల ఇన్నోసెంట్ తెలుగమ్మాయిలా, మరో పాత్రలో ధైర్య‌మున్న అమ్మాయిలా ‘సాహో' సినిమాలో ఆమె కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

శ్రద్ధా కపూర్ యాక్షన్ సీన్లు

శ్రద్ధా కపూర్ యాక్షన్ సీన్లు

ఈ చిత్రంలో శ్ర‌ద్ధా కపూర్ యాక్షన్ సీన్లు కూడా చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే శ్రద్ధా కపూర్ పాత్ర తీరుతెన్నులకు సంబంధించి చిత్ర యూనిట్ నుండి పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనా హీరో ప్రధానంగా సాగే సినిమాలో హీరోయిన్ ద్విపాత్రాభినయం అంటే విచిత్రమే మరి.

భారీ బడ్జెట్

భారీ బడ్జెట్

బాహుబలి ప్రాజెక్టు తర్వాత ప్రభాస్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘సాహో'. ఈ చిత్రాన్ని రూ. 150 కోట్లు ఖర్చుతో తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని భారీగా తెరకెక్కిస్తున్నారు.

2018 రిలీజ్

2018 రిలీజ్

యూవి క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ వేగంగా జరుగుతోంది. 2018లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

English summary
Saaho is already turning out to be the most anticipated Indian film after the Baahubali series. While the shooting of the film is going at a rapid pace, reports suggest that Shraddha Kapoor might be playing dual roles in Saaho.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu