»   » ప్రియుడి ఇంటి నుండి హీరోయిన్‌ను లాక్కొచ్చిన తండ్రి?

ప్రియుడి ఇంటి నుండి హీరోయిన్‌ను లాక్కొచ్చిన తండ్రి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ మీడియాలో హీరోయిన్ శ్రద్ధా కపూర్ గురించి ఓ షాకింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. 29 ఏళ్ల శ్రద్ధా కపూర్ కొంత కాలంగా 42 ఏళ్ల నటుడు పర్హాన్ అక్తర్ తో ప్రేమాయణం నడుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన పర్హాన్ అక్తర్ ఇటీవలే తన భార్య అధునాకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్నాడు. దీంతో అతనితో కలిసి సహజీవనం చేయాలని నిర్ణయించుకున్న శ్రద్ధా తన సామానుతో పర్హాన్ అక్తర్ ఇంట్లో దిగిపోయిందట.

shraddha kapoor-farhan akhtar

వీరి వ్యవహారంపై ముందు నుండి కోపంగా ఉన్న శ్రద్ధా కపూర్ తండ్రి, బాలీవుడ్ సినీయర్ నటుడు శక్తి కపూర్..... పర్హాన్ ఇంటికి వెళ్లి గొడవ చేసాడని, తన కూతురును అక్కడి నుండి లాక్కొచ్చాడని వార్తలు వెలువడ్డాయి.

పెళ్లయిన పర్హాన్ అక్తర్ తో శ్రద్ధా కపూర్ ప్రేమాయణం నడుపటం శక్తి కపూర్ కు ఇష్టం లేదని, కూతురును మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి లాక్కొచ్చాడని టాక్. అయితే ఈ వార్తలను శక్తి కపూర్ ఖండించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు.

35 సంవత్సరాలుగా తాను ఇండస్ట్రీలో ఉన్నాను. సినిమ వాళ్లపై ఇలాంటి వార్తలు రావడం, మేము స్పదించక పోతే రకరకాలుగా రాయడం నాకు తెలుసు. ఇవన్నీ నేను పట్టించుకోదలుచుకోలేదు. అంటూ స్పందించారు. అయితే శ్రద్ధా కపూర్, పర్హాన్ అక్తర్ వ్యవహారంపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు.

English summary
If a report in SpotboyE is to be believed, Shraddha even moved in with Farhan last week. However, her father Shakti Kapoor was livid and reached Farhan's apartment with his sister-in-law Padmini Kolhapure. Reportedly, Shakti forced Shraddha to cut short her live-in arrangement and return home. "That's total crap! It's all shit. Somebody else also called me to inform me about this, but don't believe it. It's total, total, total crap," Shakti told Bollywoodlife.com.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu