NTR31: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ హీరోయిన్ ఫిక్స్.. దీపిక కాదు కానీ బాలీవుడ్ బ్యూటీనే
ఆ మధ్య హిట్లు లేక ఇబ్బంది పడినా.. 'టెంపర్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కి.. అక్కడి నుంచి వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' విజయాలను ఖాతాలో వేసుకున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.
దీంతో అతడి మార్కెట్ కూడా భారీ స్థాయిలో పెరిగిపోయింది. అప్పటి నుంచి అతడు ఫుల్ స్వింగ్‌లో కనిపిస్తున్నాడు. దీనికితోడు RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకున్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు కొరటాల శివతో తన 30వ సినిమాను చేస్తున్నాడు.

వరుస హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యూచర్ ప్రాజెక్టులను వరుసగా లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగానే అతడు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని గత ఏడాదే అధికారికంగా ప్రకటించారు.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఇక, ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లో కానీ, మేలో కానీ మొదలు పెట్టే ఛాన్స్ ఉందని చెప్పారు. కానీ, అనివార్య కారణాల వల్ల ఇది ఆలస్యం అవుతోంది. అయినప్పటికీ ఈ ప్రాజెక్టు నుంచి తరచూ ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంటోంది.
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా ప్రారంభానికి చాలా సమయమే ఉన్నా.. ఇందులో నటించే హీరోయిన్ గురించి చాలా రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె హీరోయిన్‌గా ఎంపిక అయినట్లు చాలా రోజుల క్రితమే ఓ న్యూస్ వైరల్ అయింది.

అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా మరో బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ నటిస్తుందని తెలిసింది. ఇప్పటికే ఆమెకు నిర్మాతలు అడ్వాన్స్ కూడా ఇచ్చారని అంటున్నారు. దీంతో ఈ జోడీపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించే ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ నుంచి మొదలు పెట్టబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అప్పటి కల్లా ప్రశాంత్ 'సలార్', ఎన్టీఆర్ 30వ సినిమా పూర్తి చేసుకుంటారని అంటున్నారు.


Click it and Unblock the Notifications











