అల్లు అర్జున్‌కు హ్యాండిచ్చి.. ఎన్టీఆర్‌తో ప్రభాస్ హీరోయిన్ రొమాన్స్!
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు హీరోతో ఎలాంటి కాంబినేషన్స్ సెట్ అవుతాయో చెప్పడం కష్టం. ఓసారి ప్లాన్ చేస్తే వర్కవుట్ కానీ జోడీలు.. మరోసారి ఊహించకుండా సెట్ అయిపోతుంటాయి. అయితే గతంలో అల్లు అర్జున్‌తో పుష్ప 2 ఐటెమ్ సాంగ్‌లో బాలీవుడ్ హీరోయిన్ పేరు బలంగా వినిపించింది. అయితే దాదాపు ఖారారైపోయిందనుకునే సమయంలో ఆ ప్రాజెక్టులో సదరు హీరోయిన్ కనిపించకుండా పోయారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ఆ హీరోయిన్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఓ వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది. ఈ హీరోయిన్ గురించిన వివరాల్లోకి వెళితే..
పుష్ప 1 చిత్రంలో సమంతతో చేసిన ఊ అంటావా అనే స్పెషల్ సాంగ్ ఆ సినిమాకు ఎంతగా హైప్ ఇచ్చిందో అందరికి తెలిసిందే. అయితే ఆ పాట సినిమాకే కాదు.. సోషల్ మీడియాలో కూడా బాగా వర్కవుట్ అయింది. లక్షలాది వ్యూస్ ఆ పాటకు వచ్చాయి. వేల సంఖ్యలో రీల్స్ చేసి ఆ పాటలోని మాధుర్యాన్ని, రొమాన్స్‌ను అందరూ ఎంజాయ్ చేశారు.

ఇక పుష్ప 2 విషయానికి వస్తే.. స్పెషల్ సాంగ్ ప్లాన్ చేసినప్పుడు చాలా మంది హీరోయిన్ల పేర్లను చిత్ర యూనిట్ పరిశీలించింది. అయితే చాలా పేర్లు తెర మీదకు వచ్చి కనుమరుగైపోయాయి. అలాంటి పేర్లలో శ్రద్దాకపూర్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆమె పుష్ప 2 సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నారనే వార్త మీడియాలో హైలెట్ అయింది. అయితే తీరా చూస్తే ఆమె స్థానంలో శ్రీలీల వచ్చేసి.. స్పెషల్ సాంగ్‌లో అదరగొట్టింది.

అయితే శ్రద్దాకపూర్ స్పెషల్ సాంగ్ చేయకపోవడానికి ముందు ఆ భామ డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ కారణమని ఓ వార్త సర్కులేట్ అయింది. ఆ సమయంలో స్త్రీ 2 కోట్ల కలెక్షన్లు కురిపిస్తుండటంతో ఆ బ్యూటీ భారీగా పారితోషికాన్ని డిమాండ్ చేశారు. అందుకే ఆ మొత్తాన్ని ఇవ్వలేకుండా శ్రీలీలను తీసుకొచ్చి స్పెషల్ సాంగ్ చేశారనే వార్త మీడియాలో వైరల్ అయింది.

అయితే ప్రస్తుతం బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న వార్ 2 చిత్రంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన్‌తోపాటు మల్టీస్టారర్ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీలో శ్రద్దాకపూర్ ఓ ఐటెమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకొన్నారట. అది కూడా ఎన్టీఆర్ పక్కన స్పెషల్ సాంగ్‌లో నటించడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఈ నిర్మాత కూడా ఆమె డిమాండ్ చేసిన మొత్తాన్ని ఇవ్వడానికి సిద్దపడ్డారు. దాంతో తారక్ సరసన ఆమె స్పెషల్ సాంగ్‌లో మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











