'సాహో' బాగా క్యాష్ చేసుకున్న హీరోయిన్.. షాకింగ్ ఫీజు వసూలు చేసింది

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా 'సాహూ'. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. హీరోయిన్ శ్రద్ద కపూర్‌కి ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. అయినప్పటికీ తనకున్న క్రేజ్ దృష్ట్యా భారీ రెమ్మ్యూనరేషన్ తీసుకుందట శ్రద్ద కపూర్‌.

మొదట సాహో సినిమాలో ప్రభాస్ సరసన నటించేందుకు గాను దీపికా ప‌దుకొనే, ఆలియా భ‌ట్ లను సంప్రదించారు. కానీ వారివురు వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం కారణంగా చివరకు శ్రద్ద కపూర్‌ని తీసుకోవడం జరిగింది. అయితే 'సాహో' ద్వారా తెలుగు తెరపై అడుగు పెట్టేందుకు గాను శ్ర‌ద్ధ భారీగా రెమ్మ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. ఆమె డిమాండ్ మేరకు 7 కోట్ల రూపాయలిచ్చి శ్రద్దను ఒప్పించారని ఫిలిం నగర్ టాక్. తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సాహోకి శ్రద్ద కపూర్‌ ప్రఫార్మెన్స్ స్పెషల్ అట్రాక్షన్ కానుందని తెలుస్తోంది.

 Shraddha Kapoor Shoking Remuneration for Saaho

ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15 వ తేదీన భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్ లాంటి భారీ తారాగణం పాలుపంచుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన షేడ్స్ ఆఫ్ సాహో, లిరికల్ సాంగ్స్ ప్రేక్షకాదరణ పొందుతూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి. బాహుబలి లాంటి భారీ సినిమా తరువాత ప్రభాస్ కెరీర్‌లో రాబోతున్న సినిమా సాహోనే కావడంతో ప్రేక్షకుల్లో ఆతృత నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X