అల్లు అర్జున్‌కు రిజెక్ట్ చేసి.. ఎన్టీఆర్‌కు ఓకే చెప్పిన బాలీవుడ్ బ్యూటీ..
టాలీవుడ్ స్టార్ హీరోలు అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల గురించి ప్రత్యేకంగా చెప్పవల్సిన అవసరం లేదు. ఇద్దరు హీరోలు వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్నారు. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బాక్సాఫీసు ను షేక్ చేశాడు. ఈ సినిమా దాదాపు 1850 కోట్లను వసూలు చేసి ఇండస్ట్రీ సెన్సేషన్ గా మారింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ గతేడాది 'దేవర' సినిమాతో దుమ్మురేపాడు. అయితే ఓ టాలీవుడ్ హీరోయిన్ .. ఐకాన్ స్టార్ సినిమాను రిజెక్ట్ చేసి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అది కూడా మాస్ స్టెప్పులు వేసేందుకు ఓకే చెప్పిందట. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరు? ఈ సినిమా ఏంటీ?
యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) గతేడాది 'దేవర'(Devara)మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. భారీ విజయం అందుకున్నారు. కొరటాల శివ(Koratal Shiva) తెరకెక్కించిన ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ( Janhvi Kapoor ) హీరోయిన్‌గా నటించింది. ఇక ప్రస్తుతం 'వార్-2' ( War 2 )సినిమాతో బిజీబిజీగా ఉన్నాడు. ఈ సినిమా లో అయాన్ ముఖేర్జీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) హీరోగా నటిస్తుండగా.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వార్2ను రూ.250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 15న గ్రాండ్‌గా విడుదల కానున్నట్లు చేయనున్నది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇదిలా ఉంటే.. 'వార్-2' ( War 2 )సినిమాలో హీరో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లతో ఓ మాస్ మసాల్ లాంటి ఓ నెంబర్ సాంగ్ ను ప్లాన్ చేయబోతున్నారంట. ఇందుకోసం బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) ని తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ మేరకు ఆ ముద్దుగుమ్మను మూవీ యూనిట్ సంప్రదించినట్టు తెలుస్తోంది. ఆ అమ్మడు కూడా ఓకే చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు ఎంట్రో సాంగ్‌తో పాటు ఐటెం సాంగ్ కూడా పెడుతున్నట్టు తెలుస్తోంది. పక్కా ఊరమాస్ లా ఉండేలా ఐటెం సాంగ్ ను కంపోజ్ చేయబోతున్నారట.
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ వరుస సినిమాలతో బిజీబిజీగా మారింది. టాలీవుడ్ ప్రభాస్ హీరోగా వచ్చిన సాహో మూవీలో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తర్వాత ఈ అమ్మడు మరో మూవీ చేయలేదు. ఇక బాలీవుడ్ లో రీసెంట్ గా విడుదలైన స్త్రీ 2 మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి ఫుల్ జోష్ మీద ఉంది శ్రద్ధా కపూర్. అలాంటి క్రేజీ భామ శ్రద్ధాకపూర్, తారక్, హృతిక్ మధ్య మాస్ స్టెప్పులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి వార్ 2 ఐటెం సాంగ్ ను బాలీవుడ్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

అయితే.. ఈ వార్తలో ఎంత నిజమొందో తెలియదు. కానీ, ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అల్లు అర్జున్ అభిమానులు బాగా ఫీలవుతున్నారు. గతంతో పుష్ప 2 సినిమా ఐటెం సాంగ్ చేయడానికి శ్రద్దాకపూర్ ను సంప్రదించగా భారీ మొత్తంలో డిమాండ్ చేసిందట. దీంతో ఆ అమ్మడును సైడ్ చేసి.. శ్రీలీలను తీసుకున్న విషయం తెలిసిందే. కాగా.. తమ హీరో అల్లు అర్జున్ తో నటించకుండా ఎన్టీఆర్ తో నటిస్తోందంటూ ఫీలవుతున్నారట.


Click it and Unblock the Notifications











