NBK109: బాలయ్యతో నాని హీరోయిన్ రొమాన్స్.. ఇదెక్కడి ట్విస్టురా సామీ!

సాధారణంగా స్టార్ హీరోలకు హిట్లు వచ్చినా రాకపోయినా సినిమాలు చేస్తుంటారు. అలాంటిది వరుసగా విజయాలను అందుకుంటూ ఫుల్ ఫామ్‌లో ఉంటే ఇంకా ఎక్కువ ఉత్సాహంతో మూవీలు చేస్తుంటారు. ఇప్పుడిదే పంథాను ఫాలో అవుతున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. హ్యాట్రిక్ హిట్లతో సత్తా చాటిన ఆయన.. యమ జోష్‌తో కనిపిస్తున్నారు.

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తన 109వ సినిమాను బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు చాలా రోజుల క్రితమే పూర్తి అయిపోయాయి. 'భగవంత్ కేసరి' హడావిడి అయిపోయిన తర్వాత అంటే ఇటీవలే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్‌ను సైతం మొదలు పెట్టేశారు.

Shraddha Srinath Pair up with Nandamuri Balakrishna for Bobby Movie

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం 1980 దశకం నాటి కథతో తెరకెక్కుతోంది. దీన్ని ఈ సినిమా కాన్సెప్టు పోస్టర్‌లో రివీల్ చేశారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరుగుతూనే ఉన్నాయి. దీనికి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపొందిస్తున్నారు. ఇలానే ఫస్ట్ షెడ్యూల్‌ను కూడా కంప్లీట్ చేసేశారు.

బాలయ్య కెరీర్‌లోనే సరికొత్త పంథాలో రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్లుగా ఎవరు చేస్తారన్న దానిపై ఎన్నో రకాల ఊహాగానాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇందులో త్రిష, మీనాక్షి చౌదరిలను ఫిక్స్ చేశారని ఓ న్యూస్ వైరల్ అయింది. అలాగే, ప్రియమణి, ప్రియాంక జవాల్కర్ సహా ఎంతో మంది పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ, వీళ్లెవరూ ఫైనల్ కాలేదని తాజాగా తెలిసింది.

Shraddha Srinath Pair up with Nandamuri Balakrishna for Bobby Movie

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శ్రద్దా శ్రీనాథ్ (జెర్సీ ఫేం) నటిస్తుందట. త్వరలోనే రాజస్థాన్‌లో ప్రారంభం కాబోతున్న రెండో షెడ్యూల్‌లో ఈమె కూడా భాగం కాబోతుందని తెలిసింది. ఈమె పాత్ర ఎంతో ప్రభావాన్ని చూపించే విధంగా డిజైన్ చేసినట్లు తెలిసింది. ఇక, శ్రద్దా త్వరలోనే 'సైంధవ్' మూవీతో రాబోతున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా.. బాలయ్య మార్క్ యాక్షన్‌తో డిఫరెంట్ కాన్సెప్టుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో ఊర్వశీ రౌటేలా కీలక పాత్రను చేస్తున్నట్లు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X