ఖాన్ సాబ్ తో క్లోజ్ అవుతున్న హాట్ లేడీ
దాదాపు పదేళ్ల క్రితమే సినిమాల్లో తెరంగ్రేటం చేసిన శ్రియ శరాన్ దక్షిణాదిన మెగాస్టార్, రజినీకాంత్ తో పాటు అందరు అగ్రహీరోల సరసన నటించి, ఓ వెలుగు వెలుగి... హాట్ లేడీగా పేరు తెచ్చుకుంది. అప్పటికీ.. ఇప్పటికీ శ్రియ అందాలు వన్నెతగ్గ కుండా ఊరిస్తూ ఉన్నప్పటికీ అవకాశాలు మాత్రం లేవు. కారణం ఆమె దక్షిణాదిన చాలా పాతగా అవడమే ముందు కారణం. శ్రియ విషయంలోనే కాదు, ఇతర హీరోయన్ల విషయంలోనూ ఇదే పరస్థితి. దక్షిణాది హీరోలు, దర్శకులకు.... పాత హీరోయిన్లపై మోజు తీరడమే ఇందుకు కారణం.
అయితే.... శ్రియ ఈ విషయాన్ని గ్రహించి బాలీవుడ్ బాట పట్టింది. ఈ మధ్య బాలీవుడ్ లో ఏ కార్య క్రమం జరిగినా అక్కడ దర్శనమిస్తూ దర్శకులు, హీరోల కళ్లలో పడటానికి తన వంతు ప్రయత్నాలు చేస్తూ, మరో వైపు హాట్ హాట్ ఫోటో షూట్లతో యువతలో తపై వేడి తగ్గకుండా జాగ్రత్త పడుతోంది. గత రెండు మూడేళ్లుగా శ్రియ ఇదే తరహాలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నా...... పెద్దగా అవకాశాలు దక్కడమే లేదు.
అయితే ఇన్నాళ్లకు శ్రియ అసలు రహస్యం కనిపెట్టినట్లుంది. ఇండస్ట్రీలో ఎవరో ఒక స్టార్ హీరోతో చనువు పెంచుకుని సినిమా అవకాశాలు దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే క్రతినా, సోనాక్షి, ఆసిన్ లాంటి వారికి లైఫ్ ఇచ్చిన సల్మాన్ అయితేనే తనకు కరెక్ట్ అని భావించినట్లుంది. అతనితో బాగా దగ్గరయ్యేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications











