శ్రియ మిస్సింగ్ కు కారణం ఇదా?
శ్రియ ఈ మధ్య కనపడుట లేదు ఏంటబ్బా అని ప్రేక్షకులలో ఆలోచ లేపింది. అంతే కాదండోయో మొన్న జరిగిన స్టార్ నైట్ కి కూడా డుమ్మా కొట్టిన వారి లిస్ట్ లో ఈమె కూడా వున్నారు. మరి శ్రియ ఏమైంది అనే తరుణంలో మళ్ళీ తారల వచ్చేసింది. ఏంలేదండి. శ్రియ గత వారం రోజులుగా అండమాన్ నికోబార్ దీవుల్లోనే ఉంది. విహారం కోసం అక్కడికి వెళ్ళ లేదట. ఓ సాహస ప్రక్రియలో శిక్షణ కోసం వెళ్లింది. స్కూబా డైవింగ్ నేర్చుకోవాలని ఎప్పటి నుంచో ఆశట. ఇప్పుడు తీరిక దొరకగానే పోర్ట్ బ్లయిర్ వెళ్లి అక్కడి స్కూబా డైవింగ్ శిక్షకుల దగ్గర పాఠాలు నేర్చుకొంది. దీని గురించి శ్రియ మాట్లాడుతూ 'సాగర జలాల్లో స్కూబా డైవింగ్ నేర్చుకొంటుటంటే ఎంతో తమాషాగా ఉంది. నీటి అడుగున మరో లోకం ఉన్నట్లు అనిపించింది. పగడపు, ముత్యపు చిప్పలు లాంటివి చూస్తుంటే ఆశ్చర్యమనిపించింది. అక్కడ శిక్షణ అనుకున్నంత సులువుగా ఏమీ లేదు. సాహస ప్రక్రియ గురించి తెలుసుకోగలిగాను" అని చెప్పింది.


Click it and Unblock the Notifications











