Just In
- 14 min ago
బాలయ్య-వినాయక్ మళ్లీ మొదటికి.. ఆ చిత్రాన్ని మించి..నిర్మాత అతడే
- 33 min ago
రోజా ఓకే చెప్పింది.. బాలయ్య కష్టాలు షురూ.. బోయపాటి స్కెచ్ వర్కవుట్ కాలేదా?
- 1 hr ago
కమల్ హాసన్ పోస్టర్స్‌పై పేడ కొట్టిన లారెన్స్.. లోక నాయకుడి ఫ్యాన్స్ ఫైర్
- 1 hr ago
'అల.. వైకుంఠపురములో': పోటీ పడదామనుకున్న అల్లు అర్జున్.. చివరకు వెనకడుగు.. కొత్త డేట్ ఫిక్స్
Don't Miss!
- News
అమ్మాయిలతో లోకేశ్, కడుపుచేసే బాలకృష్ణ, టీడీపీ హయంలో సెక్స్ రాకెట్.. చంద్రబాబుపై రోజా ఫైర్
- Sports
వీడియో: వన్‌డౌన్‌లో శివమ్ దూబేని పంపడం వెనుక ప్రధాన కారణమిదే!
- Lifestyle
డయాబెటిస్ మరియు జుట్టు రాలడం: డయాబెటిస్ వల్ల పురుషులకు జుట్టు రాలవచ్చు, బట్టతల రావచ్చు ఎలాగో తెలుసా?
- Technology
డౌన్లోడ్ విభాగంలో దుమ్ము రేపుతున్న కాల్ ఆఫ్ డ్యూటీ
- Finance
పీఎం కిసాన్ స్కీం నిధులు కావాలంటే బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేసుకోవాల్సిందే
- Automobiles
హోండా యాక్టివా కొంటున్నారా..? అదిరిపోయే ఆఫర్లు మీ కోసం..
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
అసురన్ రీమేక్.. హీరోయిన్ ఫిక్స్.. డైరెక్టర్ అతనే అంటూ ప్రచారం
ఇటీవలె ధనుష్ నటించిన తమిళ సెన్సేషన్ అసురన్ తెలుగులో రీమేక్ కానున్న విషయం తెలిసిందే. ఈ రీమేక్‌లో విక్టరీ వెంకటేష్ నటించనున్నాడు. ఇప్పటి వరకు ఇదొక్కటే అందరికీ తెలిసింది. ఇక హీరోకు ఏమాత్రం తీసిపోని హీరోయిన్ పాత్ర ఎవరు, అలాంటి అద్బుతమైన కథను మళ్లీ అదే మ్యాజిక్ క్రియేట్ అయ్యేలా దర్శకుడు ఎవరు అన్న విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు. అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం.. వెంకీ పక్కన నటించేందుకు ఓ హీరోయిన్ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

రికార్డులు క్రియేట్ చేసిన అసురన్..
బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించిన అసురన్.. ధనుష్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. ధనుష్ అసాధారణ ప్రతిభ, వెట్రిమారన్ అద్భుత ఆవిష్కరణ ఇలా అన్ని కలిపి చిత్రాన్ని వేరే లెవెల్‌కు తీసుకెళ్లాయి. సహజ సిద్దంగా తెరకెక్కించిన అసురన్.. తమిళ ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది.

రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న సురేష్ ప్రొడక్షన్స్..
మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో వేరే భాషలో హిట్ అయిన సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తుంటారు దర్శక నిర్మాతలు. డబ్బింగ్ రూపంలో వచ్చిన చిత్రాల కంటే.. కొన్ని మార్పులు చేర్పులతో వచ్చే చిత్రాలే ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటాయి. అందుకే అసురన్ లాంటి చిత్రాన్ని తెలుగు ఆడియెన్స్‌కు అందించేందుకు సురేష్ ప్రొడక్షన్స్ ముందుకు వచ్చింది.

వెంకీ హీరోగా.. శ్రియా హీరోయిన్గా
టాలీవుడ్లో వెంకటేష్, శ్రియా జంటకు మంచి పేరు ఉంది. వీరి కాంబినేషన్లో ఇదివరకు వచ్చిన సుభాష్ చంద్రబోస్, గోపాల గోపాల సినిమాలు పెద్దగా ఆడలేదు. అయినా వీరిద్దరికి మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఈ రీమేక్‌లో శ్రియాను తీసుకోవాలని ఫిక్స్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్త నిజమే అయితే.. ముచ్చటగా మూడో సారి జంటగా నటించబోతోన్నట్టే.

దర్శకుడిగా ఓంకార్..
బుల్లితెరపై యాంకర్‌గా ఫేమస్ అయిన ఓంకార్.. జీనియస్ సినిమాతో దర్శకుడిగా మారాడు. అయితే ఆ చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. అటుపై రాజుగారి గది చిత్రాన్ని తీసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కానీ రాజుగారిగాది 2, 3లను తీసి నిరాశ పరిచాడు. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న ఓంకార్‌కు అసురన్ రీమేక్ బాధ్యతలు అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.