చిరంజీవి కోసం లాబీయింగ్ కి దిగిన శ్రియ....
స్లిమ్ బ్యూటీ శ్రియకు ఎట్టకేలకు జ్ఝానోదయం అయింది. బాలీవుడ్ అవకాశాల కోసం అర్రులతు చాచేకన్నా, టాలీవుడ్ లో తన స్థానాన్ని తిరిగి దక్కించుకోవడమే బెటర్ అనుకుంటోంది. ఇటీవలే 'డాన్ శీను"లో రవితేజ సరసన నటించి రీ ఎంట్రీ ఇచ్చిన శ్రియ, పవన్ కళ్యాణ్ పులి లో తన ఒంపు సొంపులతో కుర్రకారును దోచేసింది. అదే రూట్ లో అగ్రహీరోల సరసన నటించేందుకు లాబీయింగ్ చేస్తున్నట్టు తెలిసింది.
తనకున్న పాత పరిచయాల్ని తిరిగి కలుపుకుంటూ అందరితో 'టచ్"లో ఉంటోందట. ఇక ఇందులో భాగంగానే శ్రియ ఈ మధ్యన తన ఫేవరెట్ డైరెక్టర్ వివి వినాయక్ ను కలిసిందట. 'ఠాగూర్" చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో, బాలకష్ణతో తీసిన చెన్నకేశవ రెడ్డి" లో వినాయక్ శ్రియనే హీరోయిన్ గా ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిక చిరంజీవి నటించనున్న 150వ చిత్రాన్ని కూడా వినాయకే దర్శకత్వం వహిస్తున్నాడనే వార్తలు రావడంతో ముందుజాగ్రత్తగా చిరు సరసన హీరోయిన్ గా ఛాన్స్ రాబట్టుకోవాలని శ్రియ లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











