మరో ఛత్రపతి ఛాన్స్ మిస్ చేసుకొన్న శ్రియ...!
సాధ్యమైనంత వరకు తన దగ్గర ఉన్న వాటిని ప్రదర్శించేందుకు వెనుకాడని స్మైలింగ్ బ్యూటీ శ్రియకు ఈ మధ్య ఏం కలిసి రావడంలేదు? మెగాస్టార్ చిరంజీవి ప్రక్కన యాక్ట్ చేసిన శ్రియ అల్లరి నరేష్ తో నటించాల్సి వస్తుందని ఏనాడూ ఊహించి ఉండదు. అయినా ఫలానా హీరో అనే కొలతలేం లేకుండా చేస్తేనే హీరోయిన్ లకి గుర్తింపు ఉంటుందనేది ప్రక్కన పెడితే 'డాన్ శీను" తర్వాత చిత్రం లేని శ్రియకు అవకాశాలు ఇలా వచ్చి అలా చేజారిపోతున్నాయ్.
ఎవరైనా పర్వాలేదు చేతిలో ఓ చిత్రం ఉంటే చాలు అనుకున్న శ్రియ, అల్లరితో కమిటైంది. కానీ వెంటనే ప్రభాస్ తో నటించే ఛాన్స్ రావడంతో ఆమె షాకయ్యింది. ఎందుకనుకుంటున్నారా? అల్లరి నరేష్ కి ఇచ్చిన డేట్స్ లోనే ప్రభాస్ కి శ్రియ అవసరం పడడంతో ఆల్రెడీ కమిటైన అల్లరిని కాదనలేక చేసేదేం లేక మరో 'ఛత్రపతి"ని చేజేతులా మిస్ చేసుకుంది.
shriya prabhas narayana vamsi krishna srinivas శ్రియ ప్రభాస్ అల్లరి నరేష్ నారాయణ వంశీ కృష్ణ శ్రీనివాస్


Click it and Unblock the Notifications