తన తప్పు తెలుసుకొని ప్రశ్చాతాపపడుతున్న శ్రియ..
కుర్రకారుకి పిచ్చ పిచ్చగా నచ్చేసి కుర్రకారు గుండెల్లో పాగా వేసిన ఒకప్పటి క్రేజి గాళ్ శ్రియ ఆ మాటకొస్తే క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదనుకోండి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను పాటించి క్రేజ్ లో ఉండగానే తెలుగు సినిమాను వదిలిపెట్టి..తమిళ చిత్రాలవైపు వెళ్లింది. అందాల బొమ్మ. తెలుగు ప్రేక్షకులు తనపై 'ఇష్టం" పెంచుకున్నందుకు 'సంతోషం" పొందకుండా అత్యాశతో అటు కోలీవుడ్ లోనూ, ఇటు బాలీవుడ్ లోనూ వెలిగిపోవాలని వెళ్ళిపోయిన శ్రియ ఓ హాలీవుడ్ చిత్రంలోనూ చేశాననింపించేసుకుని, అన్నిచోట్లా అపజయాలే ఎదుర్కొని ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'కొమరం పులి"లో ఐటమ్ సాంగ్ చేస్తూ..'డాన్ శీను" లో రవితేజతో పుల్ లెగ్త్ రోల్ లో నటిస్తూ తెలుగులో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తోన్న శ్రియ 'నేను టాలీవుడ్ ని నిర్లక్ష్యం చేసి తప్పు చేశానని పశ్చాతపపడుతోందని అతి సన్నిహితులందించిన సమాచారం.ఇకపై ఆ పొరబాటు చెయ్యను ఇక నుంచీ నా ప్రాధాన్యత తెలుగు చిత్రాలకే" అంటూ మళ్ళీ మొదటికొచ్చింది.. అవకాశాలు తగ్గినప్పు నిజాలు ఓప్పుకోవాలి కదా..! ఏమంటారు..!


Click it and Unblock the Notifications











