For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఒకప్పటి స్టార్ డైరెక్టర్.. ఆ సీనియర్ హాట్ బ్యూటీతో.. వైరల్ న్యూస్

  |

  ఓ వైపు మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్.. అప్పటి వరకు ఉన్న కథ, కథనాలను ఒక్కసారిగా మలుపు తిప్పిన దర్శకుడు.. మరోవైపు దశాబ్దానికి పైగా అందాన్ని చెక్కుచెదర కుండా కాపాడుకుంటూ వచ్చిన హీరోయిన్.. ఇటీవలె పెళ్లి చేసుకుని భర్తతో ఎంజాయ్ చేస్తోంది.. మరి వీరిద్దరు కలిసి ఓ చిత్రాన్ని చేయబోతోన్నారని టాక్. ఇందులో విశేషముందనుకుంటే పొరబాటే.. ఎందుకంటే వీరిద్దరు హీరో హీరోయిన్లుగా నటించబోతోన్నారు. ఇంతకీ వారిద్దరూ ఎవరనేది చూద్దాం

   హీరోగా మారిన వినాయక్..

  హీరోగా మారిన వినాయక్..

  ఎన్నో హిట్లు, ఎన్నెన్నో సూపర్ హిట్లు, హీరోయిజానికి కొత్త నిర్వచనం చెప్పిన దర్శకుడు వినాయక్. విజయాలనే ఇంటి పేరుగా మార్చుకుని వివి వినాయక్‌గా మారిపోయాడు. మాస్ సినిమాలను తెరకెక్కించడంలో కొత్త ఒరవడిని సృష్టించిన వినాయక్ గత కొన్నేళ్లుగా సరైన హిట్‌ను కొట్టలేకపోతున్నాడు. అయితే రూట్ మార్చేసి హీరోగా కొత్త అవతారమెత్తాడు.

  శీనయ్యగా రాబోతోన్న వినాయక్..

  శీనయ్యగా రాబోతోన్న వినాయక్..

  ప‌లువురు స్టార్ హీరోల‌తో సినిమాల‌ను తెర‌కెక్కించి స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న వి.వి.వినాయ‌క్ శీనయ్య చిత్రంతో హీరోగా మారాడు. ఆ మధ్య రిలీజ్ చేసిన పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. మెకానిక్ పాత్రలో వినాయక్ నటిస్తున్నాడని తెలుస్తోంది. ఈ మూవీ కోసం వినాయక్ బాగానే కష్టపడ్డట్టు కనిపిస్తోంది.

  వినాయక్‌కు జోడిగా శ్రియ

  వినాయక్‌కు జోడిగా శ్రియ

  వీరిద్దరి కాంబినేషన్‌లో ఇదివరకే చెన్నకేశవ రెడ్డి, ఠాగూర్ లాంటి సినిమాలో వచ్చాయి. అయితే అప్పుడు దర్శకుడు హీరోయిన్ అన్న కాంబోలో రాగా.. ప్రస్తుతం హీరో హీరోయిన్‌లుగా జంటగా రాబోతోన్నారని టాక్. ప్రస్తుతం శ్రియ వద్ద పలు ఆఫర్లు రాగా.. అవన్నీ పెండింగ్‌లోనే ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది.

  చిన్నా పెద్దా తేడా లేదు..

  చిన్నా పెద్దా తేడా లేదు..

  అయితే పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో కాకుండా వినాయక్ లాంటి లేటు వయసు డెబ్యూ హీరో సరసన హీరోయిన్ అనగానే కొందరు పెదవి విరుస్తున్నారు. శ్రియ తన కెరీర్ ఆరంభం నుంచి ఇలాంటివి పట్టించుకోలేదు. తన కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే శ్రియ తమిళ కమెడియన్ వడివేలు సినిమాలో ఆయనకు జోడీగా నటించి అందరికీ షాక్ ఇచ్చింది. అంతే కాదు. పలు చిన్న బడ్జెట్ సినిమాల్లో కూడా నటించి తనకు సినిమాల విషయంలో పెద్ద చిన్న తేడాలు లేవని నిరూపించింది. అందుకే వినాయక్ తో జోడీ కట్టడం పెద్దగా షాక్ ఇచ్చే అంశమేమీ కాదు.

  #CineBox : Allu Arjun Is taking Huge Remuneration For Trivikram Srinivas's 'Ala Vaikuntapuramlo'?
   పారితోషికం కుదిరితే..

  పారితోషికం కుదిరితే..

  ఇప్పటికే శ్రియ ను సంప్రదించారని.. శ్రియ కూడా ఫార్మల్ గా తన పచ్చజెండా ఊపేసిందని సమాచారం. పారితోషికం విషయంలో అంగీకారం కుదిరితే వినాయక్ తో రొమాన్స్ కు రెడీ అయినట్టే. మ్యారేజ్ తర్వాత శ్రియ పెద్దగా సినిమాలు సైన్ చెయ్యలేదు. ఈమధ్య శ్రియ పేరును కొరటాల చిరు సినిమాకు .. వెంకటేష్ నటించనున్న 'అసురన్' రీమేక్ లో హీరోయిన్‌గా పరిశీలిస్తున్నారని వార్తలు వచ్చాయి కానీ ఇప్పటి వరకైతే అధికారిక ప్రకటన రాలేదు. మరి వినాయక్ సినిమాలో హీరోయిన్ అన్న వార్తైనా నిజమవుతుందో లేదో చూడాలి.

  English summary
  Shriya Saran May Act In VV Vinayak Seenaiah Movie. This Movie Is Directed by N narsimmha. DOP by Sai Sri Ram. A Manisharma Musical. Going To Release soon.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X