For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దర్శకుడితో శ్రీయ రొమాన్స్.. ఆ ఛాన్స్ రావడంతో వెంటనే!

  |

  సౌత్ సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకుంది శ్రీయ శరణ్. టాలీవుడ్, కోలీవుడ్ అగ్రహీరోలందరి సరసన రొమాన్స్ చేసిన ఈ స్టార్ బ్యూటీ.. ఇటీవలే పెళ్లి చేసుకొని సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. పెళ్లి తర్వాత భర్తతో కలిసి తెగ షికార్లు కొడుతూ ఎంజాయ్ చేసిన ఈమె.. తనకు బ్రేక్ ఇచ్చిన దర్శకుడితో రొమాన్స్‌కి రెడీ అయిందట. వివరాల్లోకి పోతే..

  దర్శకనిర్మాతలకు గాలం వేస్తూ

  దర్శకనిర్మాతలకు గాలం వేస్తూ

  కొన్నేళ్ల క్రిందట తెలుగు తెరపై స్టార్ హీరోయిన్ గా క్రేజ్ కొట్టేసిన శ్రీయ.. తిరిగి వెండితెరపై కాలుమోపాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ మేరకు పెళ్లయ్యాక కూడా అందాల ఆరబోతలో అస్సలు తగ్గడం లేదు. సోషల్ మీడియా వేదికగా తన హాట్ హాట్ సొగసులతో రెచ్చగొడుతుంది. తెలుగుతో పాటు ఇతర భాషా దర్శకనిర్మాతలకు గాలం వేస్తూ తిరిగి వెండితెర క్వీన్ కావాలని సిన్సియర్‌గా ప్రయత్నిస్తోంది.

  తెలుగు ప్రేక్షకులకు గిలిగింతలు

  తెలుగు ప్రేక్షకులకు గిలిగింతలు

  రెండు తరాల హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఇలా అందరి చెంత చేరి రొమాన్స్ చేసింది శ్రీయ. ఆ తర్వాత ఆమెకు మెల్లగా సినిమా అవకాశాలు తగ్గటం, పెళ్లి కావడం జరిగిపోయాయి. దీంతో కొంతకాలం భర్తతో ఎంజాయ్ చేసిన ఆమె.. ఇప్పుడు తిరిగి మరోసారి తెలుగు ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టేందుకు రెడీ అయిందట.

  సీనయ్యతో ఛాన్స్ పట్టేసిన సీనియర్ భామ

  సీనయ్యతో ఛాన్స్ పట్టేసిన సీనియర్ భామ

  టాలీవుడ్ స్టార్ దర్శకుడు వీ వీ వినాయక్ హీరోగా మారబోతున్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న మొదటి సినిమాకు 'సీనయ్య' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. తాజాగా ఈ ముదురు వయసు డెబ్యూ హీరో సరసన హీరోయిన్‌గా నటించే అవకాశం శ్రియ తలుపుతట్టిందట. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారం.

  ఆయనతో రొమాన్స్ చేసే అవకాశం.. ఎలా వదులుకుంటుంది మరి!

  ఆయనతో రొమాన్స్ చేసే అవకాశం.. ఎలా వదులుకుంటుంది మరి!

  అప్పట్లో వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందిన 'ఠాగూర్' సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ సంపాదించింది శ్రీయ. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి సరసన అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయి రొమాన్స్ చేసింది. ఇప్పుడు అదే దర్శకుడు హీరోగా మారుతుండటం, అందులో ఆయనతో రొమాన్స్ చేసే అవకాశం శ్రీయకు దక్కుతుందంటే ఆమె మాత్రం వదులుకుంటుందా చెప్పండి.

  #CineBox : Allu Arjun Is taking Huge Remuneration For Trivikram Srinivas's 'Ala Vaikuntapuramlo'?
  సీనయ్య అఫీషియల్ సమాచారం

  సీనయ్య అఫీషియల్ సమాచారం

  శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై తెరకెక్కుతున్న 'సీనయ్య' చిత్రానికి ‘శరభ' ఫేమ్ ఎన్. నరసింహ దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా హీరోయిన్ విషయమై అఫీషియల్ సమాచారం రానుంది.

  English summary
  Senior heroine got a chance with V. V. Vinayak movie Seenayya. As per latest talk in this movie Shriya Saran will romance with VV Vinayak.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X