గట్టుచప్పుడు కాకుండా శ్రీయా పెళ్లి.. లీక్ చేసిన టాలీవుడ్ హీరో!

By Rajababu

అందాల తార శ్రీయాసరన్ గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకొన్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సన్నిహితుల్లో అతికొద్ది మంది మాత్రమే హాజరైన కార్యక్రమంలో తన రష్యన్ బాయ్‌ఫ్రెండ్ అండ్రీ కొశ్చెవ్‌ను వివాహం చేసుకొన్నారు. శ్రీయా వివాహం మార్చి 12వ తేదీన వివాహం జరిగినట్టు సమాచారం.

Recommended Video

ఊహించిన ట్విస్ట్ ఇచ్చిన శ్రియ...!
శ్రీయా సరన్ పెళ్లి గురించి

శ్రీయా సరన్ పెళ్లి గురించి

శ్రీయా వివాహం గురించి తన సన్నిహితుడు, టాలీవుడ్ హీరో విష్ణు మంచు మీడియాకు వెల్లడించినట్టు జాతీయ పత్రికకు చెందిన వెబ్‌సైట్ ఓ కథనాన్ని ప్రకటించింది. శ్రీయా తన బాయ్‌ఫ్రెండ్ అండ్రీ కొశ్చెవ్‌ను పెళ్లిచేసుకొన్నారు అని మంచు విష్ణు వెల్లడించారు. శ్రీయా, విష్ణు కలిసి గాయత్రి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

ప్రైవేట్ వ్యవహారంగా వివాహం

ప్రైవేట్ వ్యవహారంగా వివాహం

ప్రైవేట్ కార్యక్రమంగా జరిగిన పెళ్లికి క్లోజ్ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు కొంత మందే హాజరయ్యారు. శ్రీయా నివాసానికి పక్కనే ఉండే మనోజ్ బాజ్‌పేయ్, ఆయన సతీమణి షబానా లాంటి కొందరు మాత్రమే హాజరయ్యారు అని మంచు విష్ణు వెల్లడించినట్టు పేర్కొన్నారు.

మార్చి 12వ తేదీన పెళ్లి

మార్చి 12వ తేదీన పెళ్లి

శ్రీయా సరన్ వివాహం ముంబైలోని తన లోఖండ్‌వాలా నివాసంలో మార్చి 12న మీడియా కంటపడకుండా జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం శ్రీయా, అండ్రీ దండలు మార్చుకొన్నారు. వివాహం కార్యక్రమంలో శ్రీయ పింక్ కలర్ దుస్తులను ధరించారు అని పెళ్లికి హాజరైన ఒకరు మీడియాకు లీక్ చేశారు.

మీడియాకు షాకిచ్చిన శ్రీయా సరన్

మీడియాకు షాకిచ్చిన శ్రీయా సరన్

పెళ్లికి ముందు రోజు అంటే మార్చి 11న వివాహ విందును శ్రీయా ఏర్పాటు చేసినట్టు సమాచారం. తొలుత శ్రీయా వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగుతుంది అని ప్రచారం చేశారు. కానీ మీడియా వార్తలకు భిన్నంగా ఈ వివాహం తన నివాసంలోనే జరగడం ఆశ్చర్యానికి గురిచేసింది.

 ఏడేళ్లుగా అఫైర్

ఏడేళ్లుగా అఫైర్

గత ఏడేళ్లుగా అండ్రి కృశ్చేవ్‌, శ్రీయా మధ్య అఫైర్ కొనసాగుతున్నది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తమకు సంబంధించిన సమాచారాన్ని శ్రీయా అందజేస్తున్నారు. కానీ తన సోషల్ మీడియాలో ఇద్దరు కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేయకపోవడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X