twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీనియర్ హీరో బాలయ్యకు ఆమే కావాలట! అస్సలు వదిలేలా లేడుగా..

    |

    ఇటీవలే ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా మిశ్రమ ఫలితాలు అందుకున్న నందమూరి నటసింహం బాలకృష్ణ మరోసారి ముఖానికి మేకప్ వేసుకోబోతున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య సినిమా ఉంటుందని వార్తలు వచ్చినప్పటికీ అది నిజం కాలేదు. చివరకు ఆయన తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు కమిటయ్యాడు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ సంగతేంటి? వివారాల్లోకి పోతే..

    ఎన్నికల హడావిడి.. మరోసారి ఎమ్మెల్యే

    ఎన్నికల హడావిడి.. మరోసారి ఎమ్మెల్యే

    2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్న బాలయ్య చివరకు మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. మరి రాజకీయాలతో పాటు సినిమాలు కూడా బ్యాలెన్స్ చేయాలని భావించిన ఈ సీనియర్ హీరో వెంటనే కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు కొబ్బరికాయ కొట్టేశాడు.

    బాలయ్య సరసన శ్రీయ

    బాలయ్య సరసన శ్రీయ

    కెఎస్ రవికుమార్ రూపొందిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఉందట. అయితే అందులో మెయిన్ హీరోయిన్ గా శ్రీయ శరణ్ వైపు బాలయ్య అండ్ టీమ్ చూస్తోందట. గతంలో శ్రీయ, బాలయ్య కాంబోలో వచ్చిన మూడు సినిమాల్లో ఈ జంటను చూసి నందమూరి అభిమానులు మురిసిపోయారు కాబట్టి నాలుగోసారి కూడా ఈ జంటను తెరపైకి తీసుకురావాలని డిసైడ్ అయ్యారట.

    పరిశీలనలో పాయల్ రాజ్‌పుత్

    పరిశీలనలో పాయల్ రాజ్‌పుత్

    ఇక ఇందులో రెండో హీరోయిన్ గా పాయల్ రాజ్‌పుత్ అయితే నేటి యువత బాగా రిసీవ్ చేసుకుంటారనే ఆలోచనకు వచ్చిన యూనిట్ సభ్యులు ఈమెనే కావాలని దాదాపు డిసైడ్ అయ్యారట. ఈ మేరకు పాయల్తో సంప్రదింపులు కూడా జరిగాయని చెప్పుకుంటున్నారు ఫిలింనగర్ జనం. మరోవైపు మెహ్రీన్ పేరు కూడా ప్రచారంలో ఉంది.

    క్రాంతి లేదా రూలర్

    క్రాంతి లేదా రూలర్

    ఎమోషనల్ అండ్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ సినిమాలో బాలయ్య పాత్ర మరింత అట్రాక్టీవ్ గా తీర్చిదిద్దారని సమాచారం. మరికొద్ది రోజుల్లోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాకు క్రాంతి లేదా రూలర్ అనే టైటిల్ ఫైనల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట దర్శకనిర్మాతలు.

    ఫైనల్ చేస్తారా..? నందమూరి అభిమానుల్లో ఉత్కంఠ

    ఫైనల్ చేస్తారా..? నందమూరి అభిమానుల్లో ఉత్కంఠ

    బాలయ్య తదుపరి సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. ఈ మేరకు తాజాగా వినిపిస్తున్న అప్‌డేట్స్ వారిలో ఆతృతను పెంచేశాయి. ఇప్పటి వరకు ప్రచారంలోకి వచ్చిన టైటిల్స్ గానీ, హీరోయిన్స్ గానీ బాలయ్యకు బాగా సూట్ అవుతారని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఫైనల్ గా ఏం చెప్తారో!

    English summary
    Nandamuri Balakrishna commits with director K. S. Ravikumar for his new movie NBK105. As per latest news in this film movie Blakrishna played a intresting role and Shriya Saran as heroine
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X