హీరోయిన్లు తాగుబోతులనడంపై శ్రియ ఫైర్!
ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. బయటి వారికి ఇబ్బంది కలిగించనంత వరకు ఎవరి జీవితం వారి ఇష్టం. ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకోవడం సభ్యత కాదు. నా సినిమా జీవితం గురించి ఎవరి ఎన్ని మాట్లాడినా ఓకే... పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడితే మాత్రం ఒళ్లు మండుతుంది అంటూ ఆవేశంగా రిప్లై ఇచ్చిందట.
బాలీవుడ్ తారల్లో చాలా మంది తాగుడు, మద్యానికి బానిసయ్యారు. సౌత్ లో కూడా ఆ సంస్కృతి విస్తరిస్తోంది. చాలా మంది సౌత్ హీరోయిన్స్ మద్యం సేవిస్తూ, స్మోక్ చేస్తున్నారు. సెట్స్ లో కూడా స్మోక్ చేసే వారున్నారు. కొన్ని సందర్బాల్లో వాళ్లు అతిగా మద్యం సేవించి నడవేలేని పరిస్థితులను కూడా నేను చూసాను. ఇలాంటివి చాలా వరకు బయటకు రావు...అంటూ సనా ఖాన్ వ్యాఖ్యానించగా... శ్రియ పై విధంగా స్పందించిందట.
ఆ మధ్య శ్రియ, ఆమె క్లోజ్ ఫ్రెండ్ రీమా సేన్ ఓ ప్రైవేట్ ఫార్టీలో పాల్గొన్న ఫోటోలు బయటకు లీకైన సంగతి తెలిసిందే. అందులో ఇద్దరూ మద్యం సేవించి తమ స్నేహితులతో బాగా ఎంజాయ్ చేసినట్లు ఉంది. బహుషా అందుకే నేమో శ్రియకు ఎక్కడో మండి ఇలా చిటపటలాడింది.


Click it and Unblock the Notifications












